English   

తండ్రయిన అమలాపాల్ మాజీ భర్త

vijay
2020-05-30 19:27:59

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ 2014లో ప్రేమించుకుని ఆ తర్వాత ఆ ప్రేమను వివాహ బంధంతో ముగించారు. ఆయిత అనతి కాలంలోనే వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అమలా పాల్ సినిమాల్లో నటించే విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తి అదే వారి మధ్య విడాకులకి దారి తీసింది. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టింది. ఆమె మాజీ భర్త విజయ్ జూలై 11న వివాహం చేసుకున్నారు. డాక్టర్ ఐశ్వర్య అనే ఆవిడను విజయ్ వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా విజయ్‌ తండ్రి అయ్యారు.

ఆయన భార్య ఐశ్వర్య విజయ్‌ ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అయన ”నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం గం.11.25నిల. సమయంలో విజయ్‌, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది”ని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ కంగనా హీరోయిన్‌గా ‘తలైవి’ని తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఆమె బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా మొదటి భాగాన్ని జూన్ 26న విడుదల చేయాలనుకున్నా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రిలీజ్ చేయలేకపోయారు.

 

More Related Stories