English   

ఎన్టీఆర్ అంటే ప్రత్యేక గౌరవం...అన్న లేకుంటే నేను లేను...అట్లీ సెన్సేషనల్ కామెంట్స్

ntr
2019-10-23 19:45:38

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కోరుకుంటారు. అది చిన్న డైరెక్టర్ లేదా పెద్ద డైరెక్టర్ ఎవరైనా కావచ్చు. తాజాగా కొద్ది రోజుల నుండి ఆయన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అలాగే తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వంటి వారితో సినిమా చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే అది ప్రచారం వరకే పరిమితం అయ్యేది, కానీ ఈరోజు అట్లీ మాత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. శంకర్ దగ్గర శిష్యరికం చేసి రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఆ తరువాత స్టార్ హీరో విజయ్‌తో కలిసి తేరీ(పోలీసోడు), మెర్సల్(అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

ఇప్పుడు మరోసారి విజయ్‌తోనే కలిసి విజిల్ అంటూ దీపావళి సందడి చేయనున్నాడు ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్. తెలుగులో విజిల్ పేరుతో ఈ సినిమాను ఎన్టీఆర్ వద్ద గతంలో పీఆర్వోగా పని చేసిన మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 25వ తేదీన తెలుగు మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించగా ఆ వేడుకలోనే అట్లీ ఎన్టీఆర్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.  

ఇక ఈ వేడుకలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం హీరో విజయ్ అన్నే అని, ఆయనతో సినిమా చేసిన ప్రతిసారి తనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగులో తనకు జూనియర్ ఎన్టీఆర్ గారంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని, ఎందుకంటే తన ప్రతి సినిమా రిలీజ్ అయిన తరువాత ఎన్టీఆర్ గారు ఆ సినిమా చూసి కాల్ చేసి, సినిమా అద్భుతంగా ఉందని ఎంతో ప్రేమతో మాట్లాడి తనకు మరింత బూస్టప్ ఇస్తారని చెప్పుకొచ్చారు.  తెలుగులో సినిమా చేయాలనేది తన లాంగ్ టైమ్ డ్రీమ్ అని చెప్పిన అట్లీ తెలుగులో తనకి ఎన్టీఆర్ అంటే ప్రత్యేక గౌరవం ఉందని చెబుతూ ఆయనతో సినిమా ఉండచ్చనే క్లూ ఇచ్చినట్టయ్యింది.

More Related Stories