English   

బోయపాటి ఇంట తీవ్ర విషాదం

srinu
2020-01-17 20:33:09

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఆమె ఈ రోజు అనారోగ్యం భారంతో మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం కాగా అక్కడే ఈ రోజు రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న బోయపాటి విషయం తెలియగానే హుటాహుటిన పెదకాకాని బయలు దేరి వెళ్లారు.

More Related Stories