English   

ఆచార్యకు అదిరిపోయే షాక్.. కొరటాల అసంతృప్తి.. 

Acharya
2020-03-31 14:23:20

మెగాస్టార్ చిరంజీవి కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ ఏడాది ఆచార్యతో వస్తాడని చూస్తున్న వాళ్లకు భారీ షాక్ తప్పేలా లేదు. ఈ సినిమా 2020లో రావడం కష్టమే ఇంక. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల లిస్టులో చిరు కూడా చేరిపోయాడు. ఈయన నటిస్తున్న సినిమాకు భారీ బ్రేక్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రావాల్సింది కానీ కొన్ని రోజులుగా వాయిదా పడింది. దాంతో పాటు చరణ్ ఎపిసోడ్ ఇంకా మొదలు పెట్టలేదు.. అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతుంది ఆచార్య. దాంతో ఈ చిత్రం 2020లో రావడం కస్టమే. చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. అందుకే కొరటాల కూడా రిస్క్ తీసుకోవడం లేదు. 

భరత్ అనే నేను తర్వాత రెండేళ్లైనా మరో సినిమా చేయకుండా చిరుపైనే ఫోకస్ చేసాడు. అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటున్న సమయంలో మధ్యలో చిన్న చిన్న బ్రేకులు ఏదో రూపంలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా బ్రేక్ కూడా అంతే. దాంతో కొరటాల కాస్త ఇరిటేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒక్క సినిమా కోసం మరీ మూడేళ్లు వేచి చూడటం ఏంటో అని సన్నిహితుల దగ్గర కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి లాంటి హీరో కోసం కొంత సమయం పర్లేదు కానీ మరీ ఇంత సమయం అయితే ఎలా అని ఆయన ఫీల్ అవుతున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ చిత్రం ఈ ఏఢాది వస్తుందా రాదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడనే ప్రచారం జరిగినా కూడా రెమ్యునరేషన్ కారణంగా ఆయన్ని తప్పించడంతో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ఈయన మరో ఆర్నెళ్ల వరకు ఈ సినిమా వైపు చూడడు. దాంతో ఆచార్య ఈ ఏడాది రావడం కష్టమే అంటున్నారు. కానీ కొరటాల శివ మాత్రం ఇదే ఏఢాది సినిమాను పూర్తి చేసి విడుదల చేసి.. వచ్చే ఏడాది మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆచార్య 2021 సమ్మర్ లో వచ్చేలా కనిపిస్తుంది. 

More Related Stories