English   

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ కన్నుమూత‌

KV Anand
2021-04-30 08:59:28

చిత్ర పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. తెలుగు త‌మిళ భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేవీ ఆనంద్ క‌న్నుమూశారు. ఆనంద్ గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం ఆయ‌న మ‌ర‌ణించారు. ఆనంద్ మృతితో ఇండ‌స్ట్రీలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఎన్నో త‌మిళ సినిమాల‌కు కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య హీరోగా న‌టించిన రంగం,బ్రదర్స్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కు కేవీ ఆనంద్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడి గా కంటే సినిమాటోగ్రాఫ‌ర్ గా కేవీ ఆనంద్ ఎక్కువ సినిమాల‌కు ప‌నిచేశారు. త‌మిళ‌, హిందీ, తెలుగు చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. టాలీవుడ్ లోపుణ్య‌భూమి నాదేశం సినిమాకు కేవీ ఆనందే సినిమాటోగ్రాఫ‌ర్ గా పనిచేశారు. అంతే కాకుండా కొన్ని సినిమాల‌కు కెమెరామెన్ గా కూడా ప‌నిచేశారు. ఆనంద్ త‌న కెరీర్ లో ఎన్నో అవార్డుల‌ను సైతం అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ కమెడియ‌న్ వివేక్ ఇటీవ‌లే గుండెపోటుతో మృత చెందారు. ఆయ‌న మర‌ణాన్ని మ‌ర‌వ‌క‌ముందే ఇండ‌స్ట్రీలో మ‌రో విశాదం చోటుచేసుకోవ‌డం తో త‌మిళ‌ప‌రిశ్ర‌మలో తీవ్ర విశాదం నిండుకుంది. 

More Related Stories