English   

మణిరత్నం కు నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చిందా?

Director Mani Ratnam Went Hospital not for Chest Pain
2018-07-26 18:48:13

మణిరత్నంకు హార్ట్ ఎటాక్ అంటూ కోలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయనకు తీవ్రమైన హార్ట్ ఎటాక్ రాగా.. హుటాహుటిన చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారనే వార్తలు సౌత్ మొత్తం క్షణాల్లో పాకిపోయింది. దీంతో ఆయనకేమైందా అన్న ఆందోళనలో అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ నిజానికి ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు. కేవలం జనరల్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే అపోలో హాస్పిటల్ కు వెళ్లారు. అంతకు మించి ఇంకేమీ లేదని తెలిసేసరికి అంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా మణిరత్నంపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. మరోసారి కూడా రావడంతో చాలామంది ఇది నిజమే అనుకున్నారు.

దక్షిణాది సినిమాపై అత్యంత ప్రతిభావంతమైన ముద్రవేసిన దర్శకుల్లో మణిరత్నం ముందు వరుసలో ఉంటారు. ఒకరకంగా ఇండియన్ సినిమా గతిని మార్చిన దర్శకుడుగా కూడా చెప్పొచ్చు. తెలుగులో నాగార్జునతో గీతాంజలి అనే ఒకే ఒక్క సినిమా చేసిన మణిరత్నం.. దాదాపు రియలిస్టిక్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన సినిమాల్లో డ్రామా కంటే రియాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇద్దరు, ఘర్షణ, నాయకుడు, రోజా, బొంబాయి, గురు వంటి సినిమాలే అందుకు ఉదాహరణలు.

ప్రస్తుతం ఆయన చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో నవాబ్ గా రాబోతోంది. భారీ మల్టీస్టారర్ గా రాబోతోన్న ఈ సినిమా ఈ యేడాదే విడుదల కానుంది. మొత్తంగా సెలబ్రిటీస్ ఏం చేసినా, వారికి ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూడ్డం.. లేదా పూర్తిగా నెగెటివ్ గా చూడ్డం మరీ దారుణంగా మారిపోయిందీ మధ్య కాలంలో. ఏదేమైనా మణిరత్నంకు ఇప్పుడు ఏమీ కాలేదు. ఇకపైనా ఏమీ కాకూడదని సినిమా పాలిటిక్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

More Related Stories