English   

మారుతికి ఉన్న బ్రాండ్ పోయే

Director Maruthi Brand Babu Watched Only One Person in the Theatre
2018-08-06 09:44:16

మ‌నిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ కాదు. ఉన్న‌త శిఖ‌రాలు అందుకోవాల‌నుకున్న‌పుడు క‌ష్టం కూడా అలాగే ఉండాలి. కానీ క‌ష్టం ఆవ‌గింజంత పెట్టి.. ఫ‌లితం మాత్రం ఆకాశం అంత అడిగితే ఎలా..? ఇప్పుడు మారుతిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగా ఈయ‌న‌కు తిరుగులేదు. ఒక్క ప్లాప్ కూడా లేకుండా ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు మారుతి. ఈయ‌న పేరు చెబితే సినిమాలు ఆడేస్థాయికి వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది కూడా మంచిదే కానీ ఇలా ఉంది క‌దా అని ప్ర‌తీసారి పేరు మాత్ర‌మే ఇచ్చేసి.. క‌ష్టప‌డ‌టం మ‌రిచిపోతున్నాడు మారుతి. అందుకే ఎదురుదెబ్బ‌లు త‌గులు తూనే ఉన్నాయి. ఇప్పుడు బ్రాండ్ బాబు విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

త‌న బ్రాండ్ వాడుకోవాలంటూ క‌థ రాసిచ్చేసాడు మారుతి. కానీ అదిఎలా తెర‌కెక్కింది.. వ‌చ్చింది అని తెలుసుకోవడం మ‌రిచిపోయాడు. దాంతో బ్రాండ్ బాబు కాస్తా ప్రేక్ష‌కుల పాలిట బ్యాండ్ బాబు అయ్యాడు. మ‌న ద‌గ్గ‌రే కాదు.. ఓవ‌ర్సీస్ లో కూడా బ్రాండ్ బాబు బిస్కెట్ అయిపోయాడు. క‌నీసం విడుద‌ల ఖ‌ర్చులు కూడా రాలేదు. మారుతి స్వ‌యంగా ఐదు దేశాల్లో విడుద‌ల చేస్తే వ‌చ్చింది కేవ‌లం ప‌దంటే ప‌ది డాల‌ర్లు.. సినిమా చూసింది ఒక్క‌రంటే ఒక్క‌రు. ఈ ర‌చ్చ ఇలాగే సాగితే మారుతికి ఉన్న బ్రాండ్ కూడా పోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ఈయ‌న పేరు మీద ల‌వ్ యూ బంగారం.. రోజులు మారాయి లాంటి క‌ళాఖండాలు వ‌చ్చాయి. మ‌రిప్పుడైనా మారుతి మారితే ఆయ‌న‌కే మంచిది.

More Related Stories