English   

నాగార్జున పై దర్శకుడి రివెంజ్..?

Nagarjuna-kalyan-krishna

ఇండస్ట్రీలో ఈగోస్ హర్ట్ అయితే తేడాలొస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి చాలామంది ఈ విషయంలో బయటపడరు కానీ.. కొందరు మాత్రం చాలా స్పీడ్ గా రివెంజ్ కు రెడీ అయిపోతారు. ఇదుగో ఇప్పుడు అక్కినేని నాగార్జునపై సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడులాగా. ఈ ఇద్దరి మధ్య ఎప్పుడు తేడాలొచ్చాయి అనుకుంటున్నారా..? వచ్చాయో లేదో కానీ.. వచ్చాయేమో అనేలా ఇప్పుడీ ఇద్దరి మధ్యా వార్ మొదలుకాబోతోంది. కళ్యాణ్ కృష్ణకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చింది నాగార్జున. అతని కథతోనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాగ్. అదే సోగ్గాడే చిన్నినాయనా. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని.. కథ రెడీ చేసుకోమన్నాడు నాగ్. దానికంటే ముందు తనయుడితో సినిమా చేయాలన్నాడు. నాగచైతన్యతో రారండోయ్ వేడుకచూద్దాం అనే సినిమా చేసి అతనికీ ఓ మోస్తరు విజయాన్నందించాడు కళ్యాణ్. కానీ ఇటు నాగ్ మాత్రం తన సీక్వెల్ గురించి ఏమీ మాట్లాడలేదు. కొంత కాలం వేచి చూసి ఫైనల్ గా రవితేజ వద్దకు వెళ్లాడు కళ్యాణ్ కృష్ణ. అతని కథకు రవితేజ ఓకే చెప్పాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమానే నేలటిక్కెట్టు.

అయితే ఈ సినిమాను మే 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. అదే రోజు నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న ఆఫీసర్ కూడా వస్తోంది. అంటే నాగ్ కు పోటీగా తన సినిమా రిలీజ్ చేయబోతున్నాడు దర్శకుడు. ఇది తనను చాలాకాలం పాటు వెయిటింగ్ లో ఉంచినందుకు రివెంజ్ అంటున్నారు చాలామంది. అది అవునో కాదో కానీ.. వరస చూస్తే నిజమే అనిపించక మానదు. నిన్నటి వరకూ సైలెంట్ గా ఉండి సడెన్ గా నాగ్ తో పోటీగా సినిమా విడుదల చేయడం ఏంటీ అనుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే.. అదే రోజు కళ్యాణ్, తమన్నా జంటగా నటిస్తోన్న నా నువ్వే కూడా వస్తోంది. మొత్తంగా కళ్యాణ్ కృష్ణ, నాగ్ ల మధ్య ఏదో తేడా జరిగినట్టే ఉందనిపిస్తోంది కదూ.. 

More Related Stories