English   

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్‌లో ప్రమాదం

Indian 2 accident.jpg
2020-02-20 00:01:47

కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకుని అంతా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చెన్నై శివార్లలోనే ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతుంది.

ఇప్పుడు కూడా అక్కడే షూట్ చేస్తున్న సమయంలో భారీ క్రెయిన్ పడిపోయింది. పక్కనే కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర శంకర్ ఉన్నాడు. ఆయనకు కూడా కాలు ఫ్రాక్చర్ అయిందని తెలుస్తుంది. చనిపోయిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా అక్కడే జరుగుతుంది. EVP ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ అక్కడిక్కడే మరణించడంతో ఇండియన్ 2 ఒక్కసారిగా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. భారీ క్రెయిన్ కావడంతో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

డైరెక్టర్ మానిటర్ చూసుకునే టెంట్‌పైనే క్రెయిన్ పడటంతో శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తుంది. ఆయన కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయిందని కొందరు తమిళ జర్నలిస్టులు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇక స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. అందులో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొన్ని రోజులుగా కమల్ రాజకీయాలతో పాటు భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. 2.0 సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో కాజల్, రకుల్ హీరోయిన్లు.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. 30 శాతం పూర్తయింది కూడా. మేజర్ షెడ్యూల్స్ అన్నీ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్‌, రాజస్థాన్‌ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించాడు దర్శకుడు శంకర్. దాంతో పాటు మరిన్ని కీలకమైన షెడ్యూల్స్ కోసం మార్చ్, ఎప్రిల్‌లో చైనా, థాయ్‌లాండ్‌ ప్లాన్ చేసాడు. ఆ లోపే ఈ భారీ ప్రమాదం జరిగింది.

More Related Stories