English   

ఆ బాధ్యతలు స్వీకరించిన ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి.. 

 Srinivas Reddy
2019-10-23 19:02:34

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. ఎలాగోలా నాగార్జున లాంటి సీనియర్ హీరోను ఒప్పించి.. భారీ బడ్జెట్ తో ఢమరుకం సినిమా తీసి ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి అయిపోయాడు. 2012లో ఈ సినిమా వచ్చింది. ఇప్పటి వరకు మరో సినిమా చేయని ఈయన.. ఇప్పుడు రాగల 24 గంటల్లో అంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోనే ఇది జరిగింది. స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త శ్రీ వేంకటేశ్వర్లు (తిరుపతి), ఎస్వీబీసి ఛైర్మన్ పృథ్వీ.. తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ (వైఎస్ఆర్సిపీ), రాగల 24 గంటల్లో చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు హాజరయ్యారు. వీళ్ళ సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు శ్రీ ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి. తనవంతు సాయం చేస్తానని.. స్వామి వారి రుణం కాస్తైనా తీర్చుకుంటానని చెబుతున్నాడు ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఆశీస్సులతోనే తాను తెరకెక్కించిన రాగల 24 గంటల్లో సినిమా విజయం సాధిస్తుందని చెప్పాడు ఈ దర్శకుడు. 

More Related Stories