English   

దిమ్మ‌తిరిగే షాకిచ్చిన త్రివిక్ర‌మ్..

Director Trivikram Completed 90 Percent Shooting Part of NTS's Aravinda Sametha
2018-08-06 07:17:05

ముందు చెప్తే ఎవ‌రూ న‌మ్మ‌లేదు.. తాను చేసి చూపిస్తా చూడండి అంటూ కూడా అయిన‌పుడులే అని అంతా లైట్ తీసుకున్నారు.. నేనున్నాను క‌దా అంటూ ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పిన‌పుడు కూడా ఈయ‌నింతేలే అనుకున్నారు.. కానీ ఇప్పుడు త్రివిక్ర‌మ్ చేసింది చూస్తే నిజంగానే అవును క‌దా అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. షాక్ లోనే ఉండిపోతున్నారు. అంత‌గా ఈయ‌న ఏం చేసాడ‌బ్బా అనుకుంటున్నారా..? ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయ‌బోతున్నాడు. మ‌రో ప‌ది రోజుల్లోనే ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఇంక మిగిలింది పాట‌లే. వాటిని కూడా యూర‌ప్ లో ప్లాన్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఏప్రిల్ లో మొదలుపెట్టి.. అక్టోబ‌ర్ లో విడుద‌ల చేస్తాం అంటూ ఆ అయిన‌పుడు చూద్ధాంలే అనుకున్నారంతా. పైగా అజ్ఞాత‌వాసి ఇచ్చిన షాక్ లో ఉన్నాడు క‌దా.. దాన్నుంచి బ‌య‌టికి రావ‌డానికి త్రివిక్ర‌మ్ కు కూడా కాస్త టైమ్ ప‌డుతుంది అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కేవ‌లం 75 రోజుల్లోనే ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయ‌బోతున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ లో ఇంత వేగంగా తీసిన సినిమా అయితే మ‌రేది లేదు. ఆగ‌స్ట్ మూడో వారంలో యూర‌ప్ వెళ్లి పాట‌ల చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాడు త్రివిక్ర‌మ్. సెప్టెంబ‌ర్ 15న ఆడియో వేడుక గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ 10న ద‌స‌రా సీజ‌న్ లో అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది.

More Related Stories