English   

ఆ డైరెక్టర్ ను పట్టించుకొనే నాధుడే లేడా..?

Director Venu Sriram Next movie not confirmed After Nani's MCA Success
2018-08-17 23:33:47

ఫ్లాప్ వ‌చ్చిన‌పుడు అంటే ఖాళీగా ఉంటే త‌ప్పు లేదు. ఎందుకంటే హిట్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు అనుకోవ‌చ్చు కానీ హిట్ వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆ  ద‌ర్శ‌కున్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదంటే మాత్రం ఖచ్చితంగా క‌థ‌లో ఏదో లోపం ఉన్న‌ట్లే. ఇప్పుడు వేణు శ్రీ‌రామ్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. కుర్రాడి పేరు ఎక్క‌డో విన్నట్లుంది క‌దా..? అవును.. మీరు విన్న‌ది నిజ‌మే. గ‌తేడాది నానితో ఎంసిఏ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు ఈయ‌న‌. ఏడేళ్ల కింద సిద్ధార్థ్ ఓ మై ఫ్రెండ్ అంటూ డిజాస్ట‌ర్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. ఆరేళ్ళ త‌ర్వాత ఎంసిఏతో హిట్ కొట్టాడు. అయితే ఎంసిఏ వ‌చ్చి ఎనిమిది నెల‌లైనా.. ఇప్ప‌టికీ మ‌రో సినిమా క‌నీసం అనౌన్స్ చేయ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు.

దిల్ రాజు కూడా వేణును పెద్ద‌గా ఎంకరేజ్ చేస్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఎంసిఏ ఏదో టైమ్ బాగుండి ఆడింది కానీ స్క్రిప్ట్ లో బ‌లం ఉండి కాదు. అందులో నాని.. సాయిప‌ల్ల‌వి క్రేజ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఫ‌స్టాఫ్ అరిపించిన ఈ ద‌ర్శ‌కుడు.. సెకండాఫ్ ను మాత్రం పూర్తిగా గాలికి వ‌దిలేసాడు. ఆ టైమ్ లో ఏ సినిమా లేక ఎంసిఏ సూప‌ర్ హిట్ అయింది. దాంతో వేణు శ్రీ‌రామ్ కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఏ  హీరో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి.. ఇప్పుడు దిల్ రాజు అయినా ఈ ద‌ర్శ‌కుడికి మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇస్తాడో లేదో..?

More Related Stories