English   

ఆస్తులు రాయించుకుంటున్న ద‌ర్శ‌కులు..

directors high remuneration
2018-05-30 10:25:58

ఇన్నాళ్లూ తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోలు మాత్ర‌మే నిర్మాత‌ల ఆస్తులు రాయించుకుంటారు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ల‌కు తోడుగా ద‌ర్శ‌కులు కూడా త‌యార‌య్యారు. వాళ్ల‌తో సినిమాలు చేయాలంటే ఇప్పుడు నిర్మాత‌లు నిజంగానే ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇప్పుడు లెక్కల ప్ర‌కారం టాప్ హీరోల రెమ్యున‌రేష‌న్ ఆకాశాన్ని తాకేస్తుంది. ఒక్కో సినిమాకు ఈజీగా 20 నుంచి 25 కోట్ల మ‌ధ్య తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ల‌కు తోడుగా మేమున్నాం అంటూ ద‌ర్శ‌కులు కూడా రెడీ అయిపోతున్నారు. ఒక్కో ద‌ర్శ‌కుడు ఏకంగా 15 నుంచి 18 కోట్ల మ‌ధ్య తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది అయితే అంతా కాదు.. ఈ లిస్ట్ లో కేవ‌లం ముగ్గురు నుంచి న‌లుగురు ద‌ర్శ‌కులు మాత్ర‌మే ఉన్నారు. 

వాళ్ల‌లో ముందు రాజ‌మౌళి గురించి చెప్పాలి. ఈయ‌న బాహుబ‌లితో వంద‌ల‌కోట్లు తీసుకున్న‌ట్లే. ఎందుకంటే సొంత నిర్మాతలు కాబ‌ట్టి లాభాల్లో వాటా ఉంటుంది. దాన్ని లెక్క‌గ‌ట్ట‌లేం. అయితే ఇప్పుడు ఆయ‌న దాన‌య్య‌తో చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కోసం ఏకంగా 40 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. పైగా లాభాల్లో వాటా కూడా ఉంది. ఇక ఈయ‌న‌కు తోడు కొర‌టాల కూడా ఇలాగే ఉన్నాడు. వ‌ర‌స‌గా నాలుగు విజ‌యాలు ఉండ‌టంతో ఈయ‌న ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు నిర్మాత‌లు. మొన్న భ‌ర‌త్ అనే నేనుకు లాభాల్లో వాటా క‌లిపి దాదాపు పాతిక కోట్ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలుస్తుంది. 

ఇక ఇప్పుడు మ‌హేశ్ బాబు సినిమా కోసం సుకుమార్ కు మైత్రి మూవీస్ 18 కోట్ల‌తో పాటు లాభాల్లో వాటా ఇవ్వ‌నుంద‌ని తెలుస్తుంది. రంగ‌స్థ‌లం కోసం ఈయ‌న తీసుకున్న‌ది అందులో స‌గం కూడా లేదు. అజ్ఞాత‌వాసి ప్లాప్ అయినా కూడా త్రివిక్ర‌మ్ కూడా త‌క్కువేం తీసుకోవ‌డం లేదు. ఎన్టీఆర్ సినిమా కోసం ఈయ‌న భారీగానే తీసుకుంటున్నాడు. పైగా రాధాకృష్ణ ఎలాగూ ఆస్థాన నిర్మాతే కాబ‌ట్టి ఆ లెక్క‌ల‌కు ఢోకా ఉండ‌దు. మొత్తానికి ఈ త‌రం అగ్ర ద‌ర్శ‌కులు ఒక్క హిట్ తో రేట్ పెంచుకుంటున్నారు. వీళ్ల బ్రాండ్ తోనే సినిమాలు ఆడేస్తున్నాయి కాబ‌ట్టి నిర్మాత‌లు కూడా మ‌రో మాట లేకుండా అడిగినంతా ఇచ్చేస్తున్నారు. 

More Related Stories