English   

దిశాప‌టానీ.. ఫిట్ నెస్ కా మ‌మ్మీ..!

Disha-Patani

సాధార‌ణంగా ఫిట్ నెస్ అంటే అబ్బాయిలే ఎక్కువ‌గా గుర్తొస్తారు. సిక్స్ ప్యాక్ అని.. అద‌నీ ఇద‌నీ.. ఏవేవో చేస్తుంటారు. కానీ అమ్మాయిలు కూడా ఫిట్ నెస్ పై ఇప్పుడు బాగా దృష్టి పెడుతున్నారు. హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తే.. వాళ్లు కూడా అదే రేంజ్ లో త‌మ బాడీ డెవ‌ల‌ప్ చేస్తామంటున్నారు. ఈ లిస్ట్ లో ఎప్పుడూ ముందే ఉంటుంది దిశాప‌టానీ. ఈమె అందాల ఆర‌బోతే కాదు.. దాన్ని కాపాడుకోవ‌డం కూడా ప‌క్కాగా చేస్తుంది. ఎప్పుడూ జిమ్ లోనే క‌ష్ట‌ప‌డుతూ ఉంటుంది. షూటింగ్స్ లేక‌పోతే అక్క‌డే చెమ‌ట‌లు ధార‌పోస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫిట్ నెస్ ను మెరుగుప‌రుచుకుంటూ త‌న తోటి ముద్దుగుమ్మ‌ల‌కు పోటీ ఇస్తూ ఉంటుంది. లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన దిశాప‌టాని త‌ర్వాత క‌నుమ‌రుగైపోయింది. దానికి కార‌ణం ఆమె చూపుల‌న్నీ బాలీవుడ్ పై ఉండ‌ట‌మే. అక్క‌డికి వెళ్లి ఎమ్మెస్ ధోనీ బ‌యోపిక్ లో చిన్న పాత్ర‌లో న‌టించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది గానీ దిశాకు ఒరిగిందేమీ లేదు. 

ఈ మ‌ధ్యే జాకీచాన్ తో న‌టించిన కుంగ్ ఫూ యోగా సైతం ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో త‌న జాత‌కం మారుతుంద‌ని ఆశించిన దిశా కెరీర్ జాకీచాన్ దెబ్బ‌కు ద‌శాదిశా లేకుండా పోయింది. ఇదిలా ఉండ‌గానే.. ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తుంది దిశాప‌టాని. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసింది దిశా. దీనికోసం టాప్ లెస్ గా ఈ భామ ఇచ్చిన పోజు బాలీవుడ్ తో పాటు హోల్ ఇండియాను ఊపేసింది. ఇక బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌లో కూడా దిశాప‌టానీ అందాల ఆర‌బోత‌కు అడ్డు క‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. ఇదే రేంజ్ లో సినిమాలోనూ రెచ్చిపోతా అంటూ హింటిస్తుంది దిశా. తాజాగా ఫోటోషూట్ కాదు కానీ ఫిట్ నెస్ షూట్ తో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇప్పుడు దిశా కెరీర్ కాస్త దిశ లోనే వెళ్తుంది. భాగీ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రియుడు టైగ‌ర్ తోనే మ‌రో సినిమా చేయ‌బోతుంది ఈ భామ‌. మ‌రి చూడాలిక‌.. ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్ల‌నుందో..?  

More Related Stories