English   

 లోఫర్ బ్యూటీకి సూపర్ ఆఫర్ 

disha-patani
2018-05-18 09:15:29

దిశాపటానీ దశ తిరిగే ఆఫర్ ఒకటి వచ్చింది. అందం, అది ప్రదర్శించే తెలివి ఉన్నా.. ఎందుకో అదృష్టం లేక వెనకబడిన దిశాకు ఫైనల్ గా ఓ టాప్ మూవీలో ఆఫర్ వచ్చింది. అయితే ఈ మూవీలో అమ్మడు ఏం చేస్తుందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. నిజానికి గత కొన్నాళ్లుగా దిశా విపరీతమైన వర్కువుట్స్ చేస్తోంది.. కండలు పెంచుతోంది. చిన్నపాటి మగరాయుడిలాగా పొట్టపై ‘ప్యాక్స్’కూడా వస్తున్నాయి. అయినా ఇంతటి సన్నజాజికి మరీ అంతటి కష్టమేంటో అనుకున్నారు చాలామంది. కానీ దానికి ఆన్సర్ ఇప్పుడు దొరికింది. అమ్మడికి సల్మాన్ ఖాన్ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందుకే దిశ దశ తిరిగింది అని చెప్పేది. కాకపోతే అమ్మడు సల్లూ భాయ్ కి పెయిరా కాదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా ఉంది. అయితే సల్మాన్ సినిమాలో అతనికి ఫిట్ నెస్ ఉంటే సరిపోతుంది కదా మళ్లీ హీరోయిన్ కెందుకు అనే డౌట్ రావచ్చు. అయితే దానికీ ఆన్సర్ ఉంది. 

సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, దిశా పటానీ నటిస్తోన్న ఈ మూవీ పేరు భరత్.  ఇందులో  దిశ ఓ సర్కస్ గాళ్ పాత్ర చేస్తోంది. అంటే తాళ్లు కట్టుకుని ఆ మూల నుంచీ ఈ మూలకు తిరిగే అమ్మాయిలా అన్నమాట. అంటే దాదాపు గాలిలోనే గిరికీలు కొడుతూ ఉండాలి. అందుకే ఫిట్ నెస్ కోసం ఇంత శ్రమిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సల్మాన్ కు బాగా కలిసొచ్చే రంజాన్ కు విడుదల కాబోతోంది. అంటే నెక్ట్స్  ఇయర్ లెండి.. ఈ యేడాది ఎలాగూ రేస్ -3 వస్తోంది కదా.. 2019 రంజాన్ కు భరత్ గా రాబోతున్నాడన్నమాట. 

More Related Stories