English   

క‌రుణానిధి.. సినిమాల్లోనూ నిధే..!

DMK Chief Karunanidhi Dies of Multi Organ Failure
2018-08-07 20:19:59

త‌మిళ ఇండ‌స్ట్రీకి రెండు క‌ళ్లు ఎమ్జీఆర్.. శివాజీ గ‌ణేష‌న్. వాళ్లు కాకుండా మూడో క‌న్ను కూడా ఉంది. అది శివుడి మూడో క‌న్నులా ఎవ‌రికీ క‌న‌బ‌డ‌దు. ఆ క‌న్ను పేరు ముత్తువేల్ క‌రుణానిధి. 1924 జూన్‌ 3న తమిళనాడులోని తిరుక్కువాలైలో జ‌న్మించిన ఆయ‌న‌.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనే మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఆయ‌న‌లో క‌వి.. ర‌చ‌యిత‌.. పాట‌ల ర‌చ‌యిత‌.. క‌థ‌కుడు.. స్క్రీన్ ప్లే రైట‌ర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. అన్నింటికీ మించి రాజ‌కీయ చ‌తురంగ దిట్ట‌. భార‌తదేశంలో 60 ఏళ్ల కంటే పైగానే రాజ‌కీయ జీవితం ఉన్న అతి త‌క్కువ మంది నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక్క‌రు. ఇప్పుడు ఈయ‌న లేరు.. ఈయ‌న జ్ఞాప‌కాలు త‌ప్ప‌. తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాధ ప‌డుతున్న క‌రుణానిధి.. ఆగ‌స్ట్ 7 సాయంత్రం క‌న్నుమూసారు. క‌రుణానిధి సొంత ప్ర‌దేశం తెలుగునాడులోనే ఉంది. ఈయ‌న అస‌లు పేరు దక్షిణామూర్తి. బాల్యంలోనే నాటికల రచన, సాహిత్యంపై మొగ్గు చూపించేవారు.

అప్పట్లో జస్టిస్‌పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ఆల్‌స్టూడెంట్‌క్లబ్‌ సంస్థను స్థాపించాడు క‌రుణ‌. అప్ప‌ట్లో జోరుగా జ‌రిగిన ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం. చిన్న‌నాటి నుంచి ఉద్య‌మాల్లో పాల్గొన‌డం ఈయ‌న‌కు ఇష్టం. ఇక సినిమాల‌కు స్క్రీన్ ప్లే రాయ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత క‌రుణానిధి మ‌రింత ఫేమ‌స్ అయ్యారు. ఈయ‌న సినిమాలు స‌మాజంలోని కుళ్లును.. కుతంత్రాల‌ను ఎత్తి చూపించే విధంగా ఉండేవి. అంటరాని తనం, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేక పోరాటం, ఆత్మాభిమానం.. తదితర అంశాలపై ఆయన రాసిన రచనలు సినిమాల్లో అస్త్రాలుగా మారాయి. 1952లో విడుద‌లైన శివాజీ గ‌ణేష‌న్ ప‌రాశ‌క్తి అనే సినిమా అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌మిళ ఇండ‌స్ట్రీలో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. దాదాపు 75 సినిమాల‌కు క‌థ అందించాడు క‌రుణానిధి.. 39 సినిమాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్ గా ప‌ని చేసాడు. ఈయన మృతి రాజ‌కీయ రంగానికే కాదు.. సినిమా రంగానికి కూడా తీర‌నిలోటే.

More Related Stories