English   

హైపర్ ఆది అలాంటోడు..దొరబాబు భార్య షాకింగ్ కామెంట్స్

Dorababu
2021-05-01 12:55:47

జబర్ధస్త్ షో నుండి ధన్ రాజ్, వేణు(టిల్లు) వెళ్లిపోయిన తరవాత మళ్ళీ షోకు క్రేజ్ తీసుకువచ్చిన కమెడియన్ హైపర్ ఆది. టన్నుల కొద్ది పంచులు వేసే ఆది తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. అంతే కాకుండా షోలో నాగబాబు రోజా కు ఫెవారెట్ కమెడియన్ కూడా ఆదినే అని చాలా సార్లు చెప్పారు. ఇక ఈ షో లో ఫుల్ పాపులారిటీ సంపాదించడంతో ఆది ఫుల్ బిజీగా మారిపొయాడు. అయితే కామెడీ చేస్తూ నవ్వించడమే కాకుండా ఆదిలో మరోకోణం కూడా ఉందంట. ఆ  కోణాన్ని ఆది టీమ్ లో నటించే దొరబాబు భార్య అమూల్య భయట పెట్టింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూకు వచ్చిన దొరబాబు భార్య ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ అసలు దొరబాబు ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..అని అడగ్గా మవాళ్ళు దొర లాంటివాన్ని చేసుకోమన్నారు అందుకే ఏకంగా దొరబాబు ను చేసుకున్నా అని చెప్పింది. దాంతో అక్కడే ఉన్న ఆది నీకు అంత ఫాలోవర్స్ ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. అంటూ పంచ్ వేసాడు. దాంతో ఆది గురించి అమూల్య మాట్లాడుతూ.. "ఆది మేము కష్టాల్లో ఉన్న సమయంలో..మాకెవరూ లేరనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకు వచ్చి సహాయం చేసాడు. అందుజే మా ఫోన్ లో ఆది పేరు "గాడ్" అని ఫీడ్ చేసుకున్నాం" అంటూ ఆది గొప్పతనం గురించి చెప్పింది.

More Related Stories