English   

దొరసాని సినిమా రివ్యూ 

Dorasani Review
2019-07-12 18:08:06

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, అలాగే జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్స్ గా తెరంగ్రేటం చేసిన సినిమా దొరసాని. తెలంగాణాలో 80లలో జరిగిన ప్రేమకదను కేవీఆర్ మహేంద్ర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. వారసుల సినిమా కాబట్టి ఈ సినిమా మీద సాధారణంగా ఇంటరెస్ట్ ఉండడం సహజమే, మరి ఆ మేరకు ఈ సినిమా ఆకట్టుకుండా ? లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ... 

1980ల్లో ఈ కథ కొనసాగుతుంది. రాజు (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూరులో సున్నాలు వేసుకునే వారింట పుడతాడు. సొంత ఊరులో కాక పై చదువుల కోసం పట్నం వెళ్లి చదువుకుంటాడు. ఆ ఊరి పెద్ద దొరకి ఉండే కూతురే దేవకి (శివాత్మిక). గడీలో పెద్ద దొరసాని చనిపోవడంతో చిన్న దొరసానిగా చాలా అల్లారుముద్దుగా పెరుగుతుంది. తండ్రి దొర(వినయ్ వర్మ) అంటే ఆమెకి చాలా భయం. బతుకమ్మ సంబరాల్లో తొలిసారి దొరసానిని చూసి ప్రేమలో పడిపోతాడు రాజు. దొరసాని కూడా రాజుని ప్రేమిస్తుంది. అయితే వీళ్లిద్దరూ కలిసి ముద్దులు పెట్టుకుంటున్న సమయంలో దొర చూస్తాడు. రాజుని దొంగ కేసులో ఇరికించి జైలుకి పంపుతాడు. రాజు అమ్మా నాన్నలను చిత్రహింసలు పెట్టి దేవకిని రాజుని మరచిపోమని చెబుతాడు. ఈ విషయం దొర‌కు ఎదురు తిరిగే అన్నల‌కు శంకరన్నకి (కిశోర్‌) కు రాజు - దొర‌సాని మ‌ధ్య జ‌రిగే ప్రేమ గురించి తెలుస్తుంది. పోలీసుల చేతికి చిక్కిన రాజుని కాపాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?  వారి ప్రేమ గెలిచిందా ? చివరకి ఏమైంది అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ :

కోట‌లో రాణి.. తోట‌లో రాముడు కాన్సెప్ట్ సినిమాలు చాలానే చూసాం. తెలుగులోనే బోలెడు వ‌చ్చాయి.. ఇప్పుడు దొర‌సాని కూడా అలా వ‌చ్చిందే. కాక‌పోతే తెలంగాణ బ్యాక్ డ్రాప్ పెట్టాడు ద‌ర్శ‌కుడు కేవీఆర్ మ‌హేంద్ర‌. దొర‌ల పాల‌న‌, అన్న‌ల తిరుగుబాటు, మ‌ధ్య‌లో ప్రేమ దండ‌యాత్ర‌. ఇలా మూడింటిని క‌లిపి దొర‌సాని క‌థ అల్లుకున్నాడు మ‌హేంద్ర‌. కానీ ఎందుకో తెలియ‌దు కానీ దొర‌సాని ఏ క్ష‌ణంలోనూ ఆక‌ట్టుకునేలా క‌నిపించ‌లేదు. నెమ్మ‌దిగా సాగే క‌థ‌, క‌థ‌నం. దానికితోడు ఇప్ప‌టికే ఎన్నోసార్లు చూసేసిన క‌థ‌. సినిమాపై ఎక్క‌డా ఆస‌క్తి క‌లిగించ‌లేదు సరి క‌దా. చాలా చోట్ల విసుగు పుట్టించింది కూడా. పైగా దొర‌ల పాల‌న కాబ‌ట్టి న‌క్స‌లిజాన్ని ఏదో పెట్టాల‌ని ఇరికించిన‌ట్లు అనిపిస్తుంది. అన్నింటికీ మించి సైరాత్, చంటి, గంగోత్రి సినిమాలు అణువణువునా గుర్తుకు వ‌స్తాయి. పైగా వ‌చ్చిన సీన్సే మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కిటికీ సీన్ అయితే మ‌రీనూ. తెలంగాణ నేప‌థ్యాన్ని చ‌క్క‌గా చూపించినా కూడా ఆక‌ట్టుకోని స‌న్నివేశాలు వాటిపై ఆస‌క్తి త‌గ్గించేసాయి. అయితే సినిమా ఎలా ఉన్నా పాట‌లు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు అంటే కాస్తో కూస్తో ఆస‌క్తి ఉంటుంది. కానీ ఆనంద్‌ న‌ట‌న విష‌యంలో అన్న‌య్య అంత వేగం కాదు. కానీ శివాత్మిక రాజ‌శేఖ‌ర్ బాగుంది, బాగా న‌టించింది.

ఫైనల్ గా : దొర‌సాని.. ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు చేదు జ్ఞాపక‌మే..

రేటింగ్ : 2.5 /5.

More Related Stories