English   

రిలీజ్ కు ముందే సెలబ్రేషన్స్..

Sandaikozhi-2
2018-06-25 10:44:01

వారిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా అప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది కూడా సినిమా సెట్స్ లోనే. అబ్బా.. ఎవరైనా ఇలా చేస్తారా అనుకుంటున్నారా..? అఫ్ కోర్స్ వీళ్లు చేశారు. కాకపోతే అది ఇప్పుడు చేస్తోన్న సినిమా గురించి కాదు. ఆల్రెడీ తాము చేసిన సినిమా కోసం. సో.. ఆ ఇద్దరూ ఎవరో తెలిసిపోయింది కదా.. విశాల్..అండ్ కీర్తి సురేష్. యస్ ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు సండాకోళై-2(పందెంకోడికి సీక్వెల్) చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ లో విశాల్ అభిమన్యుడు, కీర్తి మహానటి ల సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఏమాటకామాటే.. ఈ సెలబ్రేషన్స్ లో కీర్తి సురేష్ భలే సందడి చేసింది.  మహానటి కీర్తికి లైఫ్ టైమ్ మెమరీ అయితే.. అభిమన్యుడు విశాల్ కు కంటిన్యూస్ గా రెండో హిట్. అంటే అతనికి ఇది ఓ మంచి మెమరబుల్ మూమెంట్. కాకపోతే ఈ రెండు సినిమాలూ.. ఆయా ఎక్స్ పీరియెన్స్ లూ పూర్తిగా భిన్నం. అయినా కలిసి నటిస్తున్నారు కాబట్టి.. ఒకే చోట ఆ సక్సెస్ ను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరకంగా ఇది కూడా ఓ మంచి పరిణామం అనే అనుకోవాలి. సో.. ప్రస్తుతం విశాల్ సండాకోళై-2 ట్రైలర్ కూడా విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ మీరా జాస్మిన్ చేసిన అల్లరి అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సారి కీర్తి పాత్రలో కూడా అంతే అల్లరి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.. 

More Related Stories