English   

"వినయ విధేయ రామ" ఎఫెక్ట్...చిరు సినిమా డౌటే !

chiru-boyapati
2019-01-11 14:54:45

బోయపాటి శ్రీను బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో 'సింహ', 'లెజెండ్' వంటి కమర్షియల్ సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందుకున్నారు. ఆయనకు మంచి యాక్షన్ ఫిలిమ్స్ చేసే డైరెక్టర్ గా పేరుంది. ఈరోజు బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'వినయ విధేయ రామ' రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం వస్తున్న టాక్ మెగా కాంపౌండ్ లోనూ, మెగా అభిమానుల్లోనూ గుబులు పుట్టిస్తోంది. ఇక ఈ సినిమా ఆడనట్టే అని ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. దీంతో చరణ్ కెరీర్ ని నాశనం చేశావంటూ ఇప్పటికే కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో బోయపాటిని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు. వాస్తవానికి బోయపాటితో సినిమా చేయాలనీ చిరు భావించారు. కానీ ఈ టాక్ విన్నాక ఆయన మనసు మార్చుకుంటారని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా రషెస్ ని ఇంటిలో వేయించుకుని చూసిన మెగాస్టార్ అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వచ్చింది. అయితే రీషూట్స్ చేయడానికి కూడా రాజమౌళి సినిమాతో చరణ్ బిజీ అయిపోవడం సినిమా రిలీజ్ కు పెద్దగా సమయం కూడా లేకపోవడంతో రీషూట్స్ ఆలోచన పక్కన పెట్టేశారు. చరణ్ సినిమాని బోయపాటి ఇంతలా డిజాస్టర్ చేస్తాడని భావించని చిరంజీవి అప్పుడే ఆయనతో చేయాలనుకున్న సినిమాని క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో ఇక చిరుతో బోయపాటి సినిమా ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది అని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు.

More Related Stories