English   

హిందీలో దృశ్యం 2 రాబోతుంది 

Drishyam 2
2021-05-05 10:56:26

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన చిత్రం దృశ్యం 2. ఓటీటీలో విజ‌యం సాధించింది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక వర్గ వివరాలన్నీ తెలియనున్నాయి. కాగా, ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగణ్‌, శ్రియ నటించగా సీక్వెల్‌లో ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి. దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ… ‘పనోరమ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్ర హిందీ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని వల్ల దృశ్యం 2 కథ చాలామంది ప్రేక్షకులకి దగ్గరవుతుంది’ అని అన్నారు. 

More Related Stories