English   

కుర్రాడు టాలీవుడ్ కు తెగ న‌చ్చాడుగా

Dulquer-Salmaan

సౌత్ లో కొత్త‌గా వ‌స్తోన్న కుర్రాళ్ల‌లో ది బెస్ట్ టాలెంటెడ్ గ‌య్స్ త‌క్కువ‌నే చెప్పాలి. ఇక వార‌స హీరోల‌కైతే ప్రూవ్ చేసుకోవ‌డానికే టైమ్ ప‌డుతోంది. అందుకు భిన్నంగా వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చినా మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న కుర్రాడు దుల్క‌ర్ సాల్మ‌న్. మాలీవుడ్ యంగ్ స్టార్స్ లో మెగా పొజిష‌న్ లో ఉన్నాడిప్పుడు.  సౌత్ లో మోస్ట్ ప్రామిసింగ్ స్టార్స్ లో దుల్క‌ర్ ఒక‌డు. కాక‌పోతే మ‌ళ‌యాల ప‌రిశ్ర‌మ చిన్న‌ది కాబ‌ట్టి.. ఇత‌ని బిగ్గెస్ట్ టాలెంట్ పెద్ద‌గా తెలియ‌లేదు. కానీ కొన్నాళ్ల క్రితం మ‌ణిర‌త్నం క‌మ్ బ్యాక్ మూవీ ఒకే బంగార‌మ్ తో తెలుగువారిని బాగా ఆక‌ట్టుకున్నాడు. అంత‌కు ముందే కొంద‌రికి మ‌ళ‌యాల బెంగ‌ళూర్ డేస్ తో ప‌రిచ‌యం. త‌మిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి ఉన్నాడు. కానీ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో మ‌హాన‌టితో ఎంట్రీ ఇచ్చాడు. మ‌హాన‌టి సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ అద్దిరిపోయే న‌ట‌న చూపించాడు. అత‌ని ప‌ర్ఫార్మెన్స్ కు ఫిదా కాని వారు లేరంటేనే అర్థం చేసుకోవ‌చ్చు.. అత‌నెంత‌టి ప్ర‌తిభావంతుడో. మ‌హాన‌టి త‌ర్వాత దుల్క‌ర్ కు తెలుగు, త‌మిళ్ లోనూ అభిమానుల పెరిగార‌నేది నిజం. ముఖ్యంగా టాలీవుడ్ లో అత‌నికి ఫ్యాన్స్ పెరిగారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా దుల్క‌ర్ ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇటు జెమినీ గ‌ణేశ‌న్ గురించి తెలిసిన వారు కూడా దుల్క‌ర్ న‌ట‌న‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. అచ్చంగా ఆయ‌న్ని దించాడ‌ని చెప్ప‌లేం కానీ.. ఏ ద‌శ‌లోనూ దుల్క‌ర్ క‌నిపించ‌కుండా న‌టించాడు. మొత్తంగా ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనూ కార్వాన్ అనే సినిమా చేస్తోన్న దుల్క‌ర్ టాలీవుడ్ కు తెగ న‌చ్చేశాడ‌నేది నిజం. 

More Related Stories