English   

చ‌ర‌ణ్ మాట ప‌ట్టించుకోని దాన‌య్యా..!

bharat-ane-nenu
2018-05-14 13:19:01

డివివి దాన‌య్య‌.. ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నా ఇప్పుడిప్పుడే ఈయ‌న పేరు బాగా వినిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మూడు భారీ ప్రాజెక్టుల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేసాడు ఈయ‌న‌. ఇప్ప‌టికే భ‌ర‌త్ అనే నేనుతో వ‌చ్చాడు.. రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాను నిర్మాణంలో ఉంది. ఇక రాజ‌మౌళి సినిమాకు కూడా ఈయ‌నే నిర్మాత‌. ఈ మూడు సినిమాల‌తో ఇప్పుడు ఈయ‌న పేరు మార్మోగిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దాన‌య్య‌పై చ‌ర‌ణ్ కాస్త కోపంగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం భ‌ర‌త్ అనే నేను. ఈ చిత్రం 200 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసిందంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు నిర్మాత దాన‌య్య‌. ఈ విష‌యంలోనే హీరో, నిర్మాత‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. భ‌ర‌త్ అనే నేనును కావాల‌నే రంగ‌స్థ‌లం కంటే పెద్ద విజ‌యంగా చూపిస్తున్నారంటూ ఫ్యాన్స్ చ‌ర‌ణ్ కు కంప్లైంట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అందులో నిజం కూడా లేక‌పోలేదు. మూడు వారాల‌కు 205 కోట్ల గ్రాస్ అంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు దాన‌య్య‌. అయితే 205 కోట్ల‌కు దాదాపు 130 కోట్ల‌కు పైగా షేర్ రావాలి. కానీ భ‌ర‌త్ కు అంత వ‌చ్చిందా అంటే అనుమానాలే. ఇదంతా కేవ‌లం మ‌హేశ్ కు ఆల్ టైమ్ రికార్డ్ వ‌చ్చింద‌ని చెప్పుకోడానికి త‌ప్పిస్తే.. నిజంగా సినిమాకు ఇంత వ‌చ్చిందా అనేది మాత్రం ఎవ‌రికీ క్లారిటీ లేదు. కానీ నిర్మాత మాత్రం ఇలా చేస్తున్నాడు. ఈ విష‌యంలోనే దాన‌య్య‌ను చ‌ర‌ణ్ కాస్త వారించాడ‌ని తెలుస్తుంది. త‌ర్వాతి రెండు సినిమాలు చ‌ర‌ణ్ తోనే చేయాల్సి ఉన్నా కూడా భ‌రత్ ఫేక్ రికార్డుల విష‌యంలో దానయ్య వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. మ‌రి ఈ ర‌చ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలిక‌..!

More Related Stories