English   

ఈ న‌గరానికి ఏదో అయిపోయింది..

Ee Nagaraniki Emaindi
2018-06-11 07:54:12

 

త‌రుణ్ భాస్క‌ర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదేమో..? ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. అదే పెళ్లిచూపులు. నేష‌న‌ల్ వైడ్ గా కూడా ఈ చిత్రం పాపుల‌ర్ అయింది. హిందీతో పాటు త‌మిళ్ లోకి కూడా రీమేక్ అవుతుంది పెళ్లిచూపులు. అంతే కాదు.. రెండు జాతీయ అవార్డులు కూడా వ‌చ్చాయి ఈ చిత్రానికి. ఇంత‌టి సంచ‌ల‌నం త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇప్పుడు ఈయ‌న రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. తొలి సినిమా అంతా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేస్తే.. ఈ సారి మాత్రం ప‌క్కా కుర్రాళ్ళ క‌థ‌తోనే వ‌స్తున్నాడు. న‌లుగురు కుర్రాళ్ల‌ను బేస్ చేసుకుని ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ ప‌క్కా యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తో వ‌స్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా క‌థ తెలియ‌కుండా క‌ట్ చేసారు. ఏ చిన్న క్లూ కూడా ఇవ్వ‌కుండా రెండు నిమిషాల ట్రైల‌ర్ ఇచ్చాడు త‌రుణ్. ఈ చిత్రాన్ని కూడా సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. జులైలో ఈ న‌గ‌రానికి ఏమైంది విడుద‌ల కానుంది. మ‌రి పెళ్లిచూపులుతో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు రెండో సినిమాతో ఎలాంటి సంచ‌ల‌నానికి తెర తీయ‌నున్నాడో చూడాలిక‌..!

More Related Stories