English   

ఈ న‌గ‌రానికి ఏమైంది.. నెమ్మ‌దించింది..!

Ee-Nagaraniki-Emaindi

పెళ్లిచూపులు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా.. పైగా ట్రైల‌ర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.. అన్నిటికి మించి సినిమాకు కూడా టాక్ బానే ఉంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ అన్నారు. కానీ క‌లెక్ష‌న్లు మాత్రం ఊహించినంత‌గా లేక‌పోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ న‌గ‌రానికి ఏమైంది బ‌దురు ఈ ప్రేక్ష‌కుల‌కు ఏమైంది అనాల్సి వ‌స్తుందిప్పుడు. సినిమాకు టాక్ బాగానే ఉన్నా ఎందుకో కానీ క‌లెక్ష‌న్లు అంత‌గా లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 2 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు ఈ న‌గ‌రానికి ఏమైంది. అస‌లు తొలిరోజే 2 కోట్లు వ‌స్తాయ‌ని ఓ రేంజ్ లో అంచ‌నాలున్నాయి ఈ చిత్రంపై. అయితే యూత్ కు మాత్ర‌మే చేరువ‌య్యేలా ఉండ‌టం.. మందు సిగ‌రెట్లు ఎక్కువ‌గా చూపించ‌డంతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా పూర్తిగా దూర‌మైపోయింది. దాంతో ఇప్పుడు కుర్రాళ్ల‌పైనే ఈ న‌గ‌రానికి ఏమైంది భారం ప‌డింది. వాళ్లు కూడా తమ శ‌క్తి మేర సినిమాను లాగ‌డానికి ట్రై చేస్తున్నారు కానీ కావ‌డం లేదు. మ‌న దగ్గ‌ర ఏమో కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ 3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగానే వ‌సూలు చేసింది ఈ చిత్రం. మ‌రో వారం రోజులు వేరే సినిమా ఏదీ లేదు కాబ‌ట్టి బాగానే వ‌సూళ్లు వ‌చ్చేట్టు ఉన్నాయి. మ‌రి చూడాలిక‌.. త‌రుణ్ భాస్క‌ర్ ద్వితీయ‌విఘ్నం దాటేస్తాడో లేదో..? 

More Related Stories