English   

ఇది కుర్రాళ్ల న‌గ‌రం.. అదిరింది..!

Ee-Nagaraniki-Emaindi
2018-06-30 13:10:51

ఈ రోజుల్లో కుటుంబ ప్రేక్ష‌కుల కంటే కూడా కుర్రాళ్ల‌కు న‌చ్చితే చాలు.. ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. అర్జున్ రెడ్డి ఫ్యామిలీస్ చూడ‌కుండానే పాత్ బ్రేకింగ్ సినిమా అయిందంటే దానికి కార‌ణం యూత్. వాళ్లే ఇప్పుడు సినిమాకు మ‌హారాజ పోష‌కులు. వాళ్ల‌కు న‌చ్చేలా సినిమాలు చేస్తే చాలు.. నిర్మాత హాయిగా ప‌డుకోవ‌చ్చు. ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ ఇదే చేసాడు. ఈ న‌గరానికి ఏమైంది అంటూ ప‌క్కా యూత్ ఫుల్ సినిమా చేసాడు. ఇది ఇప్పుడు క‌థ లేక‌పోయినా థియేట‌ర్స్ లో తెగ ఆడేస్తుంది. మీ గ్యాంగ్ తో రండి చూసుకుందాం అంటే ఇప్పుడు నిజంగానే కుర్రాళ్ళంతా వాళ్ల గ్యాంగ్ వేసుకుని థియేట‌ర్స్ పైకి దండ‌యాత్ర‌కు వ‌స్తున్నారు. చూస్తుంటే ఈ చిత్రం పెళ్లిచూపులు కంటే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయ్యేలా ఉందిప్పుడు. క‌థ విష‌యంలో వెన‌క‌బ‌డినా.. కామెడీ విష‌యంలో మాత్రం ముందుండి సినిమాను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. దాంతో ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వెళ్లి.. ఈ న‌గ‌రంలో కామెడీ ఉంది అనుకుంటూ బ‌య‌టికి వ‌స్తున్నారు ప్రేక్ష‌కులు.  

More Related Stories