English   

ఈ న‌గ‌రానికి ఏమైంది రివ్యూ

EE-NAGARANIKI-EMAINDI
2018-06-29 07:31:03

రెండేళ్ల కింద తెలుగు ఇండ‌స్ట్రీకి చాలా సైలెంట్ గా వ‌చ్చిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. పెళ్లిచూపులు లాంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాతో వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు రెండేళ్ళ త‌ర్వాత మ‌రోసారి కొత్త వాళ్ల‌తోనే ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌చ్చేసాడు. మ‌రి ఈ సారి కూడా త‌రుణ్ స‌త్తా చూపించాడా..? 

క‌థ‌: కార్తిక్(సుశాంత్).. వివేక్ (విశ్వ‌క్ సేన్).. ఉప్పు(వెంక‌టేశ్).. కౌశిక్(అభిన‌వ్) స్నేహితులు. చిన్న‌ప్ప‌ట్నుంచీ కలిసే ఉంటారు. అంతా క‌లిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫేమ‌స్ అవ్వాల‌నుకుంటారు. కానీ లైఫ్ లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల అంతా విడిపోయి ఎక్క‌డెక్క‌డో సెటిల్ అయిపోతారు. మ‌ళ్లీ కార్తిక్ పెళ్లి కుద‌ర‌డంతో అంతా క‌లిసి పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో భాగంగానే వివేక్ త‌న బ్రేక‌ప్ ప్రేమ‌క‌థ‌ను గుర్తు చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ఫుల్ గా తాగేసి అదే మ‌త్తులో గోవా వెళ్తారు. కానీ అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత తెలుస్తుంది కార్తిక్ త‌న వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకున్నాడ‌ని. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? అస‌లు మ‌ళ్లీ త‌న‌కు ఆ రింగ్ దొరికిందా..? అస‌లు అనుకున్న‌ట్లు షార్ట్ ఫిల్మ్ తీసారా అనేది క‌థ‌..

క‌థ‌నం: పెళ్లిచూపులు క‌థేంటి అని ఎవ‌రైనా అడిగితే చెప్ప‌డానికి చాలా పెద్ద క‌థ ఉంది. త‌రుణ్ భాస్క‌ర్ అలా రాసుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం అంత సీన్ లేదు. ఈ న‌గ‌రానికి ఏమైంది క‌థ చెప్పు అంటే చెప్ప‌డానికేం లేద‌క్క‌డ‌. ఎందుకంటే అలా ఉంది క‌దా మ‌రి క‌థ‌. న‌లుగురు ఫ్రెండ్స్ చుట్టూ అల్లుకుంటూ వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తీ సీన్ లో కూడా న‌వ్వించ‌డ‌మే ముందు పెట్టుకున్నాడు. అలాగే విజ‌య‌వంతం అయ్యాడు కూడా. ప్ర‌తీ కారెక్ట‌ర్ ఇంట్రో కామెడీతోనే మొద‌ల‌వుతుంది. బార్ లో తాగుతున్నా.. రూమ్ లో ప‌డుకున్నా.. గోవాలో ఎంజాయ్ చేస్తున్నా.. అన్నిచోట్లా కామెడీ కామెడీ కామెడీ. ఫ‌స్టాఫ్ లో క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి కాస్త ల్యాగ్ చేసిన‌ట్లు అనిపించినా ఆ త‌ర్వాత పూర్తిగా ర‌చ్చ ర‌చ్చ చేసాడు ద‌ర్శ‌కుడు. కుర్ర గ్యాంగ్ ను వేసుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు ముందుకెళ్లిపోయాడు. ఈ సీన్ త‌ర్వాత ఈ సీన్ రావాలి అనే స్టీరియోటైప్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌దు. 

హాలీవుడ్ హ్యాంగోవ‌ర్ త‌ర‌హాలో క్రేజీ కాన్సెప్ట్ తో వ‌చ్చాడు త‌రుణ్ భాస్క‌ర్. మాస్ ప్రేక్ష‌కుల‌కు ఇది ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో తెలియ‌దు కానీ మ‌ల్టీప్లెక్స్ లో మాత్రం అరాచ‌కాలే. ఎమోష‌న్స్ లేకుండా కేవ‌లం న‌వ్వు న‌వ్వు అంటూ క‌డుపులు చెక్క‌లు చేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా డైలాగ్స్ విష‌యంలోనే ఎక్కువ‌గా న‌వ్వొస్తుంది. రోజూ మ‌నం మాట్లాడుకునే మాట‌లే స్క్రీన్ పై క‌నిపిస్తుంటాయి. అది ఇంకా ఎక్కువ న‌వ్వు తెప్పిస్తుంది. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో బార్ లో జ‌రిగే ర‌చ్చ నుంచి అస‌లు సినిమా మొద‌ల‌వుతుంది. గోవా వెళ్లిన త‌ర్వాత పిచ్చి పీక్స్ కు వెళ్లిపోతుంది. అక్క‌డ షార్ట్ ఫిల్మ్ తీసే క్ర‌మంలో కాస్త స్లో అవుతుంది కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ పైకి లేపాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా విశ్వ‌క్ సేన్ సైకో యాక్ష‌న్ మాత్రం అదిరిపోయింది. అత‌డికి, అభిన‌వ్ కు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్ గా పేలాయి. క్లైమాక్స్ వ‌ర‌కు కూడా పెద్దగా ట్విస్టులు ఏం లేకుండానే క‌థ ముందుకెళ్తుంది. పెళ్లిచూపులు రేంజ్ లో ఊహించుకుని వెళ్తే క‌ష్ట‌మే కానీ న‌వ్వుకోడానికి మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్.

న‌టీన‌టులు: ఇందులో న‌లుగురు హీరోలున్నారు. న‌లుగురు బాగా చేసారు. ముఖ్యంగా విశ్వ‌క్ అద్బుతంగా న‌టించాడు. ఈయ‌న కారెక్ట‌ర్ కు ఎక్కువ‌గా పేస్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. సైకోయిక్ గా ఉండే ఈ పాత్ర‌తో సూప‌ర్ ఫ‌న్ పండించాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్. ఇక కార్తిక్ గా సుశాంత్ రెడ్డి బాగున్నాడు. హై క్లాస్ లుక్స్ తో పిచ్చెక్కించాడు. అభిన‌వ్ పాత్ర పెళ్లిచూపులులో ప్రియ‌ద‌ర్శిని గుర్తు చేస్తుంది. త‌న‌కు ఉన్నంత మేర‌లో బాగానే న‌వ్వించాడు ఈ క‌మెడియ‌న్. ముఖ్యంగా వివేక్ పాత్ర‌తో వ‌చ్చే సీక్వెన్స్ బాగా పేలింది. వెంక‌టేశ్ కాకురాల బాగా చేసాడు. అనీషా ఆంబ్రోస్ తో పాటు సిమ్ర‌న్ చౌద‌రి త‌మ పాత్ర‌ల మేర‌కు ప‌ర్లేద‌నిపించారు.

టెక్నిక‌ల్ టీం: పెళ్లిచూపులుకు కూల్ మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగ‌ర్.. ఈ సారి కాస్త డోస్ పెంచేసాడు. పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా బ్యాంగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొత్త‌గా ఉంది విన‌డానికి. ఇక ఆగి ఆగి పాట బాగుంది. నికేత్ బొమ్మ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. గోవా అందాల‌ను బాగానే చూపించాడు. ఎడిటింగ్ కాస్త వీక్. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి స‌క్సెస్ అయ్యాడు. అంతా కొత్త‌వాళ్ల‌తో ఇలాంటి స‌బ్జెక్ట్ చేయ‌డం సాహ‌స‌మే. కానీ చేసాడు త‌రుణ్. కామెడీతో ప‌ర్లేదు కానీ క‌థ కావాలంటే మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది మైన‌స్ గానే మిగిలిపోయింది. 

చివ‌ర‌గా: ఈ న‌గ‌రంలో కథ త‌క్కువైంది.. కామెడీ ఎక్కువైంది.. 

రేటింగ్: 3/5

More Related Stories