English   

వామ్మో.. ఒక్కరేజే ఇన్ని సినిమాలా..?

Ee-Nagaraniki-Emaindi
2018-06-27 02:11:16

మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అంటారు. మరి సినిమాలు ఎక్కువైతే.. ప్రేక్షకులూ తగ్గిపోతారు. ఒక వారం మూణ్నాలు సినిమాలు విడుదలైనే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాంటిది ఏకంగా 11 సినిమాలు విడుదలైతే.. ఐతే ఏంటీ.. అవుతున్నాయి. వచ్చే శుక్రవారం టాలీవుడ్ లో ఏకంగా 11 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు కాదు. అన్నీ చిన్న సినిమాలు.. చిన్న ఆర్టిస్టుల సినిమాలు. అసలే చిన్న సినిమాలకు ఓపెనింగ్సే సరిగా ఉండవు. అలాంటిది మళ్లీ ఇంత పోటీ అంటే ఇంక వీటి భవిష్యత్ ఏంటనేది ఈజీగా ఊహించేయొచ్చు. వచ్చే శుక్రవారం వచ్చే సినిమాల్లో కాస్త తెలిసినవి అనిపించుకుంటోన్న సినిమా పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ నగరానికి ఏమైంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తోన్న సినిమా కాబట్టి కాస్త ప్రమోషన్ అవీ గట్టిగానే చేస్తున్నారు. పైగా దర్శకుడికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నగరానికి ఏమైంది ఏమౌతుందో చూడాలి. 

జబర్ధస్త్ షోతో ఎక్కువమందికి తెలిసిన షకలక శంకర్ హీరోగా శంభోశంకర వస్తోంది. శంకర్ చాలామంది తెలుసు కాబట్టి.. బి  సి సెంటర్స్ లో నాలుగు టికెట్స్ తెగే అవకాశం ఉంది. అల్లు వారి అబ్బాయి శిరీష్ చిన్న పాత్రలో నటించిన మళయాల సినిమాను యుద్ధభూమిగా డబ్బింగ్ చేశారు. మోహన్ లాల్ హీరోగా నటించాడు. నిజానికి ఇది మళయాలంలోనే ఫ్లాప్ అయింది. ఇక తెలుగులో ఆడుతుందా అనేది పెద్ద ప్రశ్నే. మోహన్ లాల్ కు తెలుగులో మార్కెట్ లేదు. శిరీష్ కు ఓపెనింగ్స్ తెచ్చే సీన్ లేదు. సో.. యుద్ధభూమి రిజల్ట్ తెలిసినట్టే అనుకోవచ్చు. ఇక నటించిన వాళ్లు తీసిన వాళ్లు కూడా ఎవరికీ తెలియని కొత్తవారు రూపొందించిన సినిమా నా లవ్ స్టోరీ. సిటీలో పెద్ద హోర్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులోనే కొత్తదనం కనిపించడం లేదు. దీంతోపాటు హీరోగా నిలదొక్కుకునేందుకు విక్రమార్క ప్రయత్నం చేస్తోన్న నందు నటించిన కన్నుల్లో నీ రూపమే కూడా శుక్రవారమే వస్తోంది. 

ఆ మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో ఆకట్టుకున్న మూవీ సూపర్ స్కెచ్. ఇది కూడా అదే రోజు వస్తోంది. అలాగే రాజమౌళికి నచ్చిన ‘ట్రైలర్’రూపొందించిన కుర్రాళ్లు సంజీవనితో వస్తున్నారు. ఇది గ్రాఫికల్ గా ఆకట్టుకునేలా ఉన్నా.. ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించగల వెల్ నోన్ ఫేస్ లు కనిపించడం లేదు. అలాగే మిస్టర్ హోమానంద్ అనే సినిమా కూడా ఈ సందులోనే దూరబోతోంది. మరోవైపు ఈ మొత్తం సినిమాలకు మెట్రో సిటీస్ లో షాకిచ్చేలా సంజయ్ దత్ బయోపిక్ సంజూ కూడా ఈ శుక్రవారమే వస్తోంది. కొన్నాళ్ల క్రితం హాలీవుడ్ నుంచి ఎస్కేప్ ప్లాన్ అంటూ వయసు మళ్లిన హీరోలు బాక్సాఫీస్ వద్ద బానే ఆకట్టుకున్నారు. ఆ ఓల్డ్ కుర్రాళ్లు ఇప్పుడు మళ్లీ వస్తున్నారు. ఎస్కేప్ ప్లాన్ -2 అంటూ ఈ సినిమా కూడా వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. మరి ఈ సినిమాల్లో ఎన్ని కనీసం ఆడియన్స్ విడుదలయ్యాయన్న సంగతైనా తెలుస్తుందో కానీ.. ఈ మధ్య కాలంలో ఇంత బిగ్గెస్ట్ స్మాల్ మూవీస్ పోటీ మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.. 

More Related Stories