English   

అప్పుడు క‌బాలి.. ఇప్పుడు సంజూ..!

Ee-Nagaraniki-Emaindi

చిన్న సినిమాలు పెద్ద సినిమాల‌తో పోటీ ప‌డ‌టం అనేది అరుదు. ఎప్పుడో కానీ జ‌ర‌గ‌దు. ఎందుకంటే పెద్ద సినిమాలు వ‌చ్చిన‌పుడు చిన్నోళ్ల‌ను ప్రేక్ష‌కులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోరు క‌దా. కానీ చిన్నోళ్లు కూడా నిల‌బ‌డ‌తార‌ని.. శంక‌ర్ దాదా ఎంబిబిఎస్ టైమ్ లో ఆనంద్.. చిరుత టైమ్ లో హ్యాపీడేస్.. బ్ర‌హ్మోత్స‌వం టైమ్ లో బిచ్చ‌గాడు.. క‌బాలి టైమ్ లో పెళ్లిచూపులు నిరూపించాయి. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. త‌న తొలి సినిమా ఏ రోజైతే విడుద‌లైందో.. అంటే జూన్ 29న అదే రోజు ఇప్పుడు రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైంది విడుద‌ల చేస్తున్నాడు. ఆ రోజే సంజూ విడుద‌ల కానుంది. హిందీ సినిమా అయినా కూడా తెలుగులోనూ ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పైగా రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడు కావ‌డం ఈ చిత్రానికి మ‌రో హైలైట్. దాంతో సంజూపై అంచ‌నాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ఈ చిత్రానికి పోటీగా త‌రుణ్ భాస్క‌ర్ త‌న ఈ న‌గ‌రానికి ఏమైంది విడుద‌ల చేస్తున్నాడు. 

ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీ మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇప్పుడు ఈయ‌న రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా తో వ‌స్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. తొలి సినిమా అంతా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేస్తే.. ఈ సారి మాత్రం ప‌క్కా కుర్రాళ్ళ క‌థ‌తోనే వ‌స్తున్నాడు. న‌లుగురు కుర్రాళ్ల‌ను బేస్ చేసుకుని ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ ప‌క్కా యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తో వ‌స్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. మొన్న‌ విడుద‌లైన ట్రైల‌ర్ కూడా క‌థ తెలియ‌కుండా క‌ట్ చేసారు. ఏ చిన్న క్లూ కూడా ఇవ్వ‌కుండా రెండు నిమిషాల ట్రైల‌ర్ ఇచ్చాడు త‌రుణ్. ఈ చిత్రాన్ని కూడా సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. జూన్ 29న ఈ న‌గ‌రానికి ఏమైంది విడుద‌ల కానుంది. మ‌రి పెళ్లిచూపులుతో సంచ‌ల‌నం సృష్టించిన ఈ కుర్ర ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు రెండో సినిమాతో ఎలాంటి సంచ‌ల‌నానికి తెర తీయ‌నున్నాడో చూడాలిక‌..!

More Related Stories