English   

ఇషారెబ్బా.. ఏం చూపిస్తుందబ్బా..!

Eesha Rebba Hot Photoshoot For Upcoming Movies
2018-08-21 16:39:34

ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. అందాలు ఆర‌బోస్తేనే పిచ్చెక్కించ‌డం కాదు.. ప‌ద్ద‌తిగా కూడా ప్రాణాలు తీయొచ్చ‌ని ఇషా రెబ్బా చూపిస్తుంది. ఈ మ‌ధ్య బాగానే సినిమాలు చేస్తుంది ఈ భామ‌. అందుకే పేరుతో ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు కూడా అవ‌స‌రం లేదు. కాక‌పోతే క్రేజ్ త‌క్కువ క‌దా.. గుర్తు చేస్తే గానీ అంత త్వ‌ర‌గా గుర్తొచ్చే పేరు కాదు ఈ భామ‌ది. ప‌క్కా తెలుగ‌మ్మాయి కావ‌డ‌మే ఇషారెబ్బాకు శాపంగా మారింది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు.

ఈ మ‌ధ్యే నాని నిర్మించిన అ.. మారుతి బ్రాండ్ బాబు సినిమాల్లో న‌టించింది ఇషారెబ్బా. అయితే ఇవి మ‌న ముద్దుగుమ్మ‌కు క‌లిసిరాలేదు. ఇక ఇప్పుడు సుమంత్ హీరోగా వ‌స్తున్న సుబ్ర‌మ‌ణ్య‌పురం.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ మాజీ ల‌వ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది ఈ భామ‌. ఇప్పుడిప్పుడే స్టార్ అవ్వడానికి ఒక్కో అడుగు వేస్తున్న ఇషా.. ఇప్పుడు అందాల ఆర‌బోత‌కు కూడా సై అనేస్తుంది. తాజాగా హాట్ ఫోటోషూట్ తో మెంట‌ల్ ఎక్కించింది ఇషారెబ్బా. ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయిన ఈ బ్యూటీ.. చిన్న‌చ‌డ్డీల‌తో ఉసురు తీస్తుంది. మొత్తానికి ఈ తీరు చూసిన త‌ర్వాతైనా క‌నీసం ఏదో ఓ ద‌ర్శ‌కుడు అర్జంట్ గా ఇషా కెరీర్ కు బ్రేక్ ఇవ్వాల్సిందే.

More Related Stories