English   

ఎన్టీఆర్ ల‌వ‌ర్ గా ఆ తెలుగమ్మాయి..!!

jr.ntr

ఇండ‌స్ట్రీలో తెలుగమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు అని ఇంకెవ్వ‌రూ అన‌కూడ‌దు. ఎందుకంటే ఈ మ‌ధ్య మ‌న ముద్దుగుమ్మ‌ల‌కు హీరోలు బాగానే ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇషా రెబ్బా కూడా మెల్ల‌గా క్రేజీ హీరోయిన్ అవుతుంది. పైగా అందాల ఆర‌బోత‌లోనూ ఇషాకి పెద్ద‌గా ప‌ట్టింపు లేన‌ట్లే అనిపిస్తుంది. ఈ మ‌ధ్యే స్విమ్మింగ్ పూల్ లోనూ అందాలు ఆర‌బోసింది ఈ భామ‌. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు. ఆ త‌ర్వాత మ‌రోసారి ఇంద్ర‌గంటే బందిపోటులో న‌రేష్ తో న‌టించే ఛాన్సిచ్చారు. కానీ అది డిజాస్ట‌ర్. త‌ర్వాత మ‌ళ్లీ ఇంద్ర‌గంటి అమీతుమీతో హిట్ కొట్టింది.

తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేసింది ఈషా. ఇక్క‌డ అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఈ మ‌ధ్యే నాని నిర్మించిన అ.. సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది ఇషారెబ్బా. ఆ సినిమా ప‌ర్లేద‌నిపించింది. ఇప్పుడు సుమంత్ హీరోగా ఓ సినిమాలో న‌టిస్తుంది ఇషా. ఇక ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్- ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌లోనూ ఆఫ‌ర్ అందుకుంది ఇషా. ఇందులో ఎన్టీఆర్ మాజీ ల‌వ‌ర్ గా న‌టిస్తుంది ఈ భామ‌. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ కూతురుగా ఇషా క‌నిపించ‌బోతుంది. నాగ‌బాబు ఇందులో ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా క‌నిపిస్తున్నాడు. ఆఫ‌ర్లు రావాలంటే అందాలు ఆర‌బోయక త‌ప్ప‌ద‌ని తెలుసుకుని.. ఇలా చిన్న క్యాస్ట్యూమ్ లో అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. ఇది చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ఆఫ‌ర్లు ఇవ్వ‌కపోతారా అని ఆశ‌. మ‌రిప్పుడు ఎన్టీఆర్ చ‌లువ‌తో మిగిలిన హీరోలు కూడా ఈ తెలుగ‌మ్మాయిని ఆదుకుంటారా..

More Related Stories