English   

పూజాహెగ్డే చెల్లి పిచ్చెక్కించింద‌బ్బా..

Eesha-Rebba
2018-09-24 14:10:05

పూజాహెగ్డేకు చెల్లెలు ఉందా..? ఎప్పుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది..? అస‌లెలా ఉంది..? ఇన్ని డౌట్స్ వ‌స్తున్నాయి క‌దా ఒకేసారి. అయితే పూజాహెగ్డె చెల్లి అంటే అర‌వింద చెల్లి అని అర్థం. అర‌వింద అంటే పూజాహెగ్డే. అర‌వింద స‌మేత‌లో ఆ పాత్ర‌లో న‌టిస్తుంది ఈ భామ‌. ఇందులో అర‌వింద చెల్లిగా ఇషా రెబ్బా న‌టిస్తుంది. ఈ భామ ఎన్టీఆర్ మాజీ ప్రేమికురాలిగా ఇందులో న‌టిస్తుంది. అయినా ఈ మ‌ధ్య తెలుగమ్మాయిలు బాగానే రెచ్చిపోతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇషారెబ్బా కూడా వ‌చ్చి చేరిపోయింది. ఇన్నాళ్లూ కాస్త ప‌ద్ద‌తి గానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్విమ్ సూట్ వ‌ర‌కు వ‌చ్చేసింది. ఆ మ‌ధ్య స్విమ్మింగ్ పూల్ లో ఫోటో ఇది షేర్ చేసింది ఈ భామ‌. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాగే అందాల‌న్నీ పంచి అభిమానుల్ని ప‌ర‌వ‌శంలో ముంచేస్తుంది ఇషా. 

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్న బ్యూటీ ఈషా. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత మాత్రం అనుకున్నంత‌గా అవ‌కాశాలు మాత్రం ఈషా త‌లుపు త‌ట్ట‌లేదు. అయితే రెండేళ్లుగా ఈ భామ కెరీర్ బాగానే ఉంది. అమీతుమీ.. అ.. సినిమాల్లో న‌టించింది. అయినా ఇండ‌స్ట్రీలో అందాల ఆర‌బోత‌లో కాస్త హ‌ద్దులు పెట్టుకుంటే ప‌ని జ‌ర‌గ‌ద‌ని తెలుసుకున్న‌ ఈషా.. ఇప్పుడు ఆ బారికేడ్ల‌న్నీ తెంచేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది ఈషా. ఇప్పుడు సుమంత్ హీరోగా వ‌స్తున్న సుబ్ర‌మ‌ణ్య‌పురంలో న‌టిస్తుంది ఇషా. ఇక అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ ల‌వ‌ర్ గా న‌టిస్తుంది ఇషా. ఇంకా ఆఫ‌ర్లు రావాలంటే అందాలు ఆర‌బోయక త‌ప్ప‌ద‌ని తెలుసుకుని.. ఇలా చిన్న క్యాస్ట్యూమ్ లో అందాలు ఆర‌బోస్తుంది ఈ భామ‌. ఇది చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒక‌రు ఆఫ‌ర్లు ఇవ్వ‌క పోతారా అని ఆశ‌.

More Related Stories