English   

అఁ.. భామకు అదిరిపోయే ఛాన్స్

eesha-ntr
2018-05-23 14:36:17

తెలుగువారికి తెలుగులో అవకాశాలు రావడం లేదని చాలాకాలంగా వింటూనే ఉంటున్నాం.. కానీ డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా మాత్రం స్టెప్ బై స్టెప్ టాలీవుడ్ లోనే ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకూ స్మాల్ మూవీస్, స్మాల్ స్టార్స్ అనే స్ట్రాటజీ ఫాలో అయిన ఈషాకు ఒక్కసారిగా ఊహించని ఆఫర్ వచ్చింది. అది కూడా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో. యస్.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ భామను కూడా తీసుకున్నట్టు టాలీవుడ్ రూమరై కూస్తోంది. అఫ్ కోర్స్ ఈ వార్త నిజమే అనేలా ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వార్తలు వస్తున్నాయిలే.. రేపో మాపో ఈ వార్త అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉంది.. కానీ మరీ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు అని ముందు నుంచీ వినిపిస్తోంది. అయితే ఆ పాత్ర కోసం ఏ ముంబై బ్యూటీని తెస్తారా అని అనుకుంటున్న వారికి త్రివిక్రమ్ చిన్నపాటి షాకే ఇచ్చాడు. నిజంగా ఈ ఆఫర్ ఈషా కూడా ఊహించి ఉండదు. అందుకే అమ్మడు ఇప్పుడు క్లౌడ్ నైన్ లో ఉందట. ఆల్రెడీ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంది. ఇక ఈషాకు ఏ మేరకు చాన్స్ ఉంటుందా అనుకోవాల్సిన అవసరం లేదు. పాత్ర లెంగ్త్ ఎంతైనా.. త్రివిక్రమ్ హ్యాండ్ పడితే అమ్మడు ఎలివేట్ కావొచ్చు. అయితే ఈ సినిమాలో ఈషాను తీసుకోవానికి ప్రధాన కారణం తను రీసెంట్ గా చేసిన అఁ సినిమాయేనట. అవును.. ఆ సినిమాలో ఈషా చాలా బావుంది. ఇప్పటి వరకూ కనిపించిన దానికి భిన్నమైన మేకోవర్ చాలా బ్యూటీఫుల్ గా ఉంటుంది. ఆ లుక్ నచ్చే త్రివిక్రమ్ ఈ పాత్ర ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు.. ఏదేమైనా ఈ వరంగల్ పోరికి వండర్ ఫుల్ ఆఫర్ వచ్చినట్టే.. 

More Related Stories