English   

ఛలో రూట్ లోనే నర్తనశాల కూడా

Egireney-Manasu

నాగశౌర్య లేటెస్ట్ మూవీ @నర్తనశాల.. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు. కశ్మీరా, యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కాస్త గట్టిగా ప్లాన్ చేయాలని ముందు నుంచీ మూవీ టీమ్ ప్లాన్ చేసుకుని ఉంది. అయితే ఈ ప్లానింగ్ అంతా ఛలోను పక్కాగా ఫాలో అవుతున్నట్టుగా ఉంది. అప్పుడు కూడా ఛలో నుంచి చూసీ చూడంగానే నచ్చేశావె అంటూ ఓ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసి మొత్తం ఆడియన్స్ అటెన్షన్ కు గ్రాబ్ చేశారు. ఆ పాట మెలోడీకి ఫిదా అయ్యారంతా. అలాగే పాటలో రష్మిక మందన్నా స్మైల్స్ కు కూడా పడిపోయారు ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేయడానికి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను రిలీజ్ చేసింది @నర్తనశాల టీమ్. 

మహితి స్వరసాగర్ సంగీతం అందిస్తోన్న ఈ @నర్తనశాల నుంచి ఓ కొత్త పాట విడుదల చేశారు. అంతా లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తోన్న వీళ్లుమాత్రం ఛలో రూట్ లో ఏకంగా వీడియో సాంగ్ నే వదిలారు. చిత్రంగా ఈ పాట కూడా భలే ఉంది. నిజంగా బ్యూటీఫుల్ మెలోడి. అయితే రివర్స్ లో హీరోయిన్నే హీరోను ఆరాధిస్తున్నట్టుగా ఉంది. కంప్లీట్ మాంటేజ్ సాంగ్ లా ఉన్నఈ పాటలో ‘ఎగిరెనే మనసు సీతాకోకలాగా ఎగిరెనే ఎపుడిలాగా నువ్విచ్చిన రెక్కలవల్లేగా చుక్కల్లో విహరిస్తున్నాగా’ అంటూ అందమైన సాహిత్యం కూడా ఉంది. దానికి మరింత అందమైన ట్యూన్ తోడు కావడంతో వినగానే ఆకట్టుకుంటోందీ పాట. ఇక చూసీ చూడంగానే అనే పాట రాసిన భాస్కరభట్లతోనే ఈ పాటనూ రాయించారు. సమీరా భరద్వాజ్ తో కలిసి సంగీత దర్శకుడు స్వరసాగర్ స్వరం కలిపాడు. మరి ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో కానీ.. నిజంగానే ఈ పాట బ్యూటీఫుల్ అంతే. 

More Related Stories