English   

దుమ్ము రేపుతున్న వెల్లువొచ్చి గోదారమ్మ టీజర్

valmiki
2019-09-17 20:45:10

హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్న సినిమా వాల్మీకి. మాస్ సినిమాల రీమేక్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ జిగార్తాండ సినిమ్కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో అధర్వ మురళి మరో కీలక పాత్రలో నటించారు. ఇక మరో రెండ్రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి.

;ఇక శోభన్ బాబు శ్రీదేవిల కాంబినేషన్లో 1982లో వచ్చిన దేవత సినిమాలోని వెల్లువొచ్చి గోదారమ్మ అనే సూపర్ హిట్ సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. అయితే అదే పాటను మళ్ళి ఎస్పీ బాలు గారు మరియు సుశీల గారితో పాడించినట్లు చెబుతున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈరోజు ఈ సాంగ్ వీడియో ప్రోమో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. అచ్చంగా శోభన్ బాబు, శ్రీదేవిలను పోలినట్లుగా వరుణ్ మరియు పూజలు ఈ పాటలో అదరగొట్టినట్లు ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  

 

 

 

More Related Stories