హ్యాపీ బ‌ర్త్ డే టూ భ‌ళ్లాళ‌దేవా ఆఫ్ టాలీవుడ్ రానా ద‌గ్గుపాటి.. RANA DAGGUPATI BIRTHDAY
2018-12-14 20:42:23

టాలీవుడ్ ఆజానుబాహుడు.. ద‌గ్గుపాటి వార‌సుడు.. రానా పుట్టిన‌రోజు నేడు. డిసెంబ‌ర్ 14న 1984న జ‌న్మించాడు రానా. లీడ‌ర్ లాంటి సెన్సిబుల్ మూవీతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రానా.. త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. హీరోగా నిల‌బ‌డ‌టం కంటే న‌టుడిగా గుర్తింపు కోస‌మే రానా ఆరాట‌

పడుతుండ‌టం విశేషం. ఇప్ప‌టికే బాహుబ‌లి, రుద్ర‌మదేవి లాంటి సినిమాల‌తో తెలుగులో రానాకు సూప‌ర్ ఇమేజ్ వ‌చ్చేసింది. త‌ర్వాత ఘాజీ, నేనే రాజు నేనేమంత్రి సినిమాల‌తో స్టార్ గా కూడా మారిపోయాడు. ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ స‌త్తా చూపిస్తున్నాడు రానా. తోటి హీరోలంతా తెలుగు ఇండ‌స్ట్రీపైనే ఫోక‌స్ పెడుతుంటే.. రానా మాత్రం అంద‌రి వాడు అనిపించుకుంటున్నాడు. ఓ వైపు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు హిందీలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. 

ద‌మ్ మారో ద‌మ్ తో బాలీవుడ్ కి వెళ్లిన రానా.. త‌ర్వాత డిపార్ట్ మెంట్, బేబీ లాంటి సినిమాల‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళ‌నాట రానాకు గుర్తింపు ఉంది. అజిత్ ఆరంభం సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు రానా. ఇలా అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ రానాకు స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు కూడా తెలుగులో ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో న‌టించాడు. దాంతో పాటే 1945.. హాథీ మేరీ సాథీ.. హౌజ్ ఫుల్ 4 లాంటి సినిమాలు చేస్తున్నాడు. దానికితోడు నెంబ‌ర్ వ‌న్ యారీ లాంటి టీవీ షోల‌తో దున్నేస్తున్నాడు రానా ద‌గ్గుపాటి. ఈ సంద‌ర్భంగా రానాకు 34వ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతుంది సినిమాపాలిటిక్స్.కామ్.

More Related Stories