వాయిదా పడిన చైతూ-సాయి పల్లవి సినిమా sai pallavi
2019-08-27 09:24:38

హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలు చేసి ఇప్పుడు సైలెంట్ అయిన శేఖర్ కమ్ముల ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్న సనగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ఈ మధ్యనే లాంఛనంగా పూజాదికాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నటీనటులను కూడా దాదాపుగా సెలెక్ట్ చేసేశారు. అయితే ఈ సినిమాని నిన్నటి నుండి సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకున్నారు శేఖర్‌ కమ్ముల. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం. ఈ సినిమా షూట్ అనుకున్న రోజు కంటే వారం రోజులు వెనక్కి షిఫ్ట్‌ చేశారు. ఇది డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ తెలంగాణకి చెందిన వారని ఇద్దరూ ఆ యాసలోనే మాట్లాడనున్నారని సమాచారం. నిజానికి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్‌ 26న అంటే నిన్న స్టార్ట్‌ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడిన ఈ సినిమా సెప్టెంబర్‌ 5న షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారట. డిసెంబర్‌కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. మరి సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో బహుశా ఫిబ్రవరిలో రిలీజ్ చేయచ్చని అనుకుంటున్నారు.
 

More Related Stories