వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్...అందరినీ ఏకేసిన వర్మ Caste Feeling Song
2019-08-27 11:07:30

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో చూపీ స్ట్రాటజీలు ఒక పట్టాన అర్ధం కావు. ఈ విషయంలో అయన మిగతా దర్శకుల కంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలోనూ  తనదైన దారిలోనే నడుస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ నటించిన ‘సాహో’ విడుదలకు సిద్ధం కానుండగా, ప్రభాస్ కులాన్ని తన కులంతో ముడిపెట్టిన వర్మ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా కాస్ట్ ఫీలింగ్ అంటూ ఒక సాంగ్ కూడా రెడీ చేశాడు. తనకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న వర్మ అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ప్రకటించినట్టుగానే ఈ సాంగ్ ని కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశాడు వర్మ. "కమ్మలు... కాపులు... రెడ్లు... రాజులు... వైశ్యులు..." అంటూ మొదలయ్యే ఈ పాట  "నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు... ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా... ఈ హిపోక్రసీ? ఎందుకురా... ఈ హిపోక్రసీ? అంటూ సాగుతుంది. 

ఈ పాట ద్వారా వర్మ ఏపీ పొలిటికల్ లీడర్స్ ను టార్గెట్ చేశాడు. అలాగే తమకి కుల ఫీలింగ్ ఉన్నా లేనట్టు షో చేసేవారందరినీ టార్గెట్ చేసినట్టు వర్మ చెబుతున్నారు. అయితే ఇది ఆంధ్రా ప్రాంతానికి సంబందించిన సినిమా కాబట్టి తెలంగాణా జోలికి వెళ్ళలేదు వర్మ. రాజులు మొదలు వైశ్యుల దాకా అందరినీ వర్మ ఇక్కడ టార్గెట్ చేసినట్టే. ఆయన లాజిక్ ప్రకారం నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు... ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు అని, నిజమే ఇవన్నీ తప్పు కానప్పుడు తన కులం అంటే మాత్రం తప్పు ఎందుకు అని వర్మ లాజికల్ గా ప్రశ్నిస్తున్నాడు. చూద్దాం ఈ సాంగ్ ఎన్ని వివాదాలకి కారణం అవుతుందో ?

More Related Stories