శ్రీదేవి మైనపు బొమ్మ...భావోద్వేగానికి గురైన బోనీ...జాన్వీsridevi
2019-09-04 19:02:29

దివంగత నటి దక్షిణాది నుండి వెళ్లి బాలీవుడ్ వెళ్లి అతిలోక సుందరిగా స్థిరపడిపోయిన శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌ లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది ఫిబ్రవరి 24 వ తేదీన దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఈ రోజు శ్రీదేవి కుటుంబ సభ్యులు బోనీ, ఖుషీ, జాన్వీల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. సినిమా రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు మ్యూజియం నిర్వాహకులు చెబుతున్నారు. శ్రీదేవి నటించిన సూపర్ హిట్ సినిమా మిస్టర్ ఇండియా సినిమాలోని ‘హవా హవాయి’ పాటలోని  స్టిల్‌ను బొమ్మగా మలిచారు.

అయితే అంతా బాగానే ఉంది కానీ విగ్రహంలో ఏదో లోపం ఉంది. అందుకే శ్రీదేవి విగ్రహంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పోలికలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు బోనీ కపూర్, జాన్వీలు కన్నీరుమున్నీరయ్యారు. ఇక శ్రీదేవికి నివాళిగా మ్యూజియం నిర్వాహకులు అభిమానులు రాసిన సందేశాలను విగ్రహం వెనకున్న బోర్డుపై అతికించారు. వాటి మీద బోనీ కూడ సంతకం చేశారు. అయితే గ‌తంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, సల్మాన్, మాధురి దీక్షిత్ ఇక టాలీవుడ్‌ నుంచి మహేష్, ప్రభాస్ ల మైన‌పు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. అయితే చనిపోయిన వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే మధుభాల ఆ తర్వాత శ్రీదేవి విగ్రహమే ఏర్పాటు చేశారు.

 

More Related Stories