విజయ్ దేవరకొండ వెళ్తున్న రూట్ కరెక్టేనా.. సినిమాలు వదిలేసి ఏంటిలా..?vijayd
2019-09-09 21:43:10

ఏంటి.. విజయ్ దేవరకొండ సినిమాలు వదిలేస్తున్నాడా.. చేస్తున్నాడు కదా.. అయినా ఆయన సినిమాలు కాకుండా ఇంకేం చేస్తాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత జోరు తగ్గిస్తాడేమో అనుకున్నారు కానీ ఇంకా పెంచేసాడు ఈ హీరో. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాతో పాటు పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు విజయ్. ఈ లోపు సినిమాలతో పాటు యాడ్స్ పై కూడా కాన్సట్రేట్ చేస్తున్నాడు ఈ హీరో. ముఖ్యంగా బిజినెస్ కూడా విస్తరించే పనిలో బిజీ అవుతున్నాడు ఈ రౌడీ. దాంతో పాటు నిర్మాణంలోకి కూడా దిగాడు. ప్రస్తుతం మీకు మాత్రమే చెప్తా సినిమాతో నిర్మాతగా మారిపోయాడు ఈయన. ఇదిలా ఉంటే యాడ్స్ విషయంలో కూడా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ కు ప్రచారం చేస్తున్న ఈయన.. ఇప్పుడు కియారా అద్వానీతో కలిసి మరో బ్రాండింగ్ కు ఒప్పుకున్నాడు. తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అంటూ ఆ మధ్య ఓ షోలో చెప్పింది కియారా. ఇప్పుడు తన అభిమాన హీరోతో కలిసి యాడ్ చేస్తుంది కియారా. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ యాడ్ చేస్తున్నారు. దాంతో పాటు బాలీవుడ్ వైపు కూడా అడుగు వేస్తున్నాడు విజయ్. ఇప్పటికే అక్కడ కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేయడానికి పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ తగ్గించి విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్లస్ యాడ్స్ లో ఎంతదూరం ప్రయాణిస్తాడో..?

More Related Stories