ఆఫీసర్ వ్యాస్ గా మారిన కోటిkoti
2019-09-12 14:44:38

సాలూరి రాజేశ్వరరావు అంటే ఆయనెవరని అడుగుతారేమో కానీ కోటి అంటే మాత్రం నేటి తరం తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కోటి సుమారుగా 500 చిత్రాలకి స్వరాలు సమకూర్చి అగ్ర సంగీత దర్శకుడిగా మారాడు. ఇప్పుడు కాస్త కుర్ర సంగీత దర్శకుల హవా వలన స్పీడ్ తగ్గించారు కానీ ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమలకి ఆయన సుపరిచితుడు. రాజ్‌తో కలిసి రాజ్‌ - కోటి ద్వయంగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై తమదైన ముద్ర వేశారాయన. ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కోటి విజయవంతమైన ఎన్నో చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. మణిశర్మ, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి ప్రముఖ సంగీత దర్శకులు వాళ్ల కెరీర్‌ ఆరంభంలో కోటి దగ్గర శిష్యరికం చేశారంటే ఆయన ఎంత ఫేమస్సో అర్ధం చేసుకోవచ్చు. 

అయితే ఇప్పుడిదంతా ఎందుకంటే 80లలో బెజవాడలో సంచలనాలకు కేరాఫ్‌ అయిన దేవినేని, వంగవీటి రంగాల కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం). శివనాగు దర్శకత్వంలో రాము రాథోడ్‌ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న, రంగా పాత్రలో ‘సంతోషం’ ఎడిటర్‌ సురేశ్‌ కొండేటి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రంగా సతీమణి రత్నకుమారిగా తమిళ నటి ధృవతార కనిపించనున్నారు. రంగాతో కలిసి ఉన్న ఆమె లుక్‌ను రిలీజ్‌ చేసింది యూనిట్. తాజాగా అప్పటి పోలీస్ ఆఫీసర్ గా అందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన వ్యాస్ గా కోటి నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ లుక్ లో ఆయనను ఏమాత్రం గుర్తు పట్టలేము. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసెయ్యండి మరి.

More Related Stories