చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..Sye Raa
2019-10-01 18:27:06

ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో సైరాను మించిన మేనియా మరోటి లేదు. చిరంజీవి సినిమా అంటేనే రచ్చ రచ్చ ఉంటుంది. దానికితోడు సైరా లాంటి విజువల్ వండర్ అంటే క్రేజ్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు సైరాకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ సినిమాకు రోజుకు 6 షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. దాంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో కూడా దీనికి ప్రయత్నించినా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి అయితే రాలేదు. కానీ సైరాకు పెట్టిన బడ్జెట్.. దసరా హాలీడేస్ సందర్భంగా ఈ చిత్రానికి 6 షోలు వేసుకుంటే మంచిదని భావించారు దర్శక నిర్మాతలు. ఇలాగే గవర్నమెంట్ కు అర్జీ పెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి జగన్ సర్కార్ కూడా సానుకూలంగానే స్పందించారు. రోజుకు 6 షోలకు అనుమతి రావడంతో సైరా పాజిటివ్ టాక్ కానీ తెచ్చుకుంటే రికార్డులు బద్ధలైపోవడం ఖాయం. కచ్చితంగా మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ పై దండెత్తి రికార్డులతో చెడుగుడు ఆడుకోవడం కూడా ఖాయం. మరి చూడాలి.. సైరాతో మెగాస్టార్ ఎలాంటి మెగా మ్యాజిక్ చేస్తాడో..?

More Related Stories