నా సినిమాలు ఎవరు చూడమన్నారు.. విద్యాబాలన్ సంచలనం..  Vidya Balan
2019-10-09 13:49:00

ఎవరైనా తమ సినిమాలు చూడండి.. చూసి ఆశీర్వదించండి అంటారు. కానీ విద్యాబాలన్ మాత్రం రివర్స్.. తమ సినిమాలు ఎవరు చూడమన్నారు అంటూ రివర్స్ లో కౌంటర్స్ వేస్తుంది. తనను చూడటం ఇష్టం లేకపోతే సినిమాలు చూడొద్దు అంటూ మొహం మీదే చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డర్టీ పిక్చర్, కహానీ, తుమారీ సులు మొదలు ఎన్నో సంచలన సినిమాల్లో నటించింది ఈమె. అంతేకాదు నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. 40 దాటినా ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది విద్యా. ఇప్పటికీ ఈమె హీరోయిన్ గానే నటిస్తుంది. అప్పుడప్పుడూ అక్క, వదిన పాత్రలు వస్తున్నా నో చెప్తుంది విద్యాబాలన్. పైగా పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు విద్యాబాలన్. ప్రస్తుతం ఈమె శకుంతలా దేవి సినిమాలో నటిస్తుంది. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ గణితవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే విద్యాబాలన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తానంటే ఇష్టంలేని వాళ్లు తను చేసిన సినిమాలు కూడా చూడనక్కర్లేదని.. డర్టీ పిక్చర్, కహానీ సినిమాల తర్వాత తాను సొంతంగా సినిమాలను ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నానని.. తన బోల్డ్‌నెస్‌తో అన్ని భాషల్లోనూ నటిస్తున్నానని చెబుతుంది. తాను ఎంపిక చేసుకునే సినిమాలు కొందరికి నచ్చుతాయి.. కొందరికి నచ్చవు... అందులో ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. తానంటే ఇష్టం లేని వాళ్లు సింపుల్ గా తన సినిమాలు చూడటం మానేస్తే సరిపోతుంది కదా అని చెప్పింది ఈమె. మొత్తానికి ఓ హీరోయిన్ ఇలా తన సినిమాలు చూడొద్దని చెప్పడం కూడా చిన్న విషయం కాదు. 

More Related Stories