వారిని టార్గెట్ చేస్తున్న విజయ్ దేవరకొండvijay
2019-10-12 06:27:44

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను లైన్‌ లో పెడుతూ బిజీగా ఉన్నాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. మొన్న రిలీజయిన డియర్ కామ్రేడ్ దెబ్బ వేయడంతో మళ్ళీ తన సినిమాల మీద ద్రుష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ఈమధ్యనే వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ కూడా ప్రకటించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ‌ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇందులో విజయ్ ప్లే బాయ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు టైటిల్ ని బట్టి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని  తీసుకురానున్నారని టాక్. ఇక మరో పక్క విజయ్ దేవరకొండ ‘హీరో’ అనే మల్టీలింగ్వల్‌ మూవీ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ఫైట‌ర్‌’లోనూ నటించనున్నాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2020 వేసవిలో రిలీజ్ కానుందని సమాచారం. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కోసమే పూరీ జగన్నాథ్ తో ఫైటర్ మూవీ చేస్తున్నాడని అంటున్నారు. చూడాలి మరి అది ఏమేరకు ఫలిస్తుందో ?

More Related Stories