పృధ్వీరాజ్ కి చెక్ పెట్టేందుకే యాంకర్ స్వప్న ఎంట్రీ Anchor Swapna
2019-10-14 11:14:21

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్ బాలిరెడ్డిని గతంలోనే నియమించిన ప్రభుత్వం వీరి నియామకం వెనక మాత్రం ముఖ్య కారణాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేంటంటే తిరుమలలో దేవుడికి సేవ చేయమని అవకాశం ఇస్తే మరి నటన మీద ప్రేమ తోనో లేక పెద్ద నటులు ఆ వేషం వేస్తే చూశారు నేను చేస్తే చూడరా అన్నట్టు ఎటకారంగా అన్నమాచార్యులవారిని అనుకరించడం, వాగ్గేయకారుడిలా వీడియో ఆహ్వానాలు షూట్ చేయడంవంటి పనులు చేసి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. 

అవి ఫేస్ బుక్ ట్విట్టర్ లు సహా టిక్ టాక్ లో కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పెత్తనానికి చెక్ పెట్టేందుకే యాంకర్ స్వప్న ను లైన్ లోకి తెచ్చారని అంటున్నారు. ఆమెతో పాటు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అయితే ఆయా కార్యక్రమాల సృష్టి సృజనాత్మకత వంటివి చూసుకుని ఈయన్ని తప్పిస్తారు అని అంటున్నారు. ఈ విషయాన్ని యాంకర్ స్వప్న మీడియా వర్గాల్లో ఎప్పుడో ప్రచారం మొదలెట్టిందని అంటున్నారు. ఇక పృధ్వీతో కలిసి ఈ డైరెక్టర్లు ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు. నిజానికి ఎస్వీబీసీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రభుత్వం ఈ సారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది. ఎందుకంటే భక్తి ఛానల్ లో ప్రోగ్రామ్స్ ని అలవాటుల్ లేని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ప్రుద్వీని చూశారని అందుకే తొలుత దూరదర్శన్, టీవీ9లో పనిచేసి ఆ తర్వాత సాక్షి లో చేరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ స్వప్న ను ఆయన వద్ద నియమించారని టాక్.

More Related Stories