ఖైదీ సినిమా తెలుగు హక్కులు తీసుకున్న రవితేజ నిర్మాత..karthi
2019-10-15 17:09:25

కార్తికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. మార్కెట్ కూడా ఉంది. దాంతో మనోడి సినిమాలకు అక్కడే కాదు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న ఖైదీ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. ఇప్పుడు అందరిని పక్కకి నెట్టేస్తూ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత KK రాధామోహన్ ఖైదీ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాడు. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. స్యామ్ CS సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ చిత్రంలో నరైన్, ధీనా, మరియం జార్జ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చేసిన ఖైదీ సినిమా టైటిల్ ఇప్పుడు కార్తి సినిమాకు కూడా పెట్టడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు వివేకనంద పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఖైదీ సినిమాను నిర్మిస్తున్నాయి. దివాళికి సినిమా విడుదల కానుంది. రాధామోహన్ ఈ సినిమాతో భారీ హిట్ అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ అంతా రాత్రుళ్లే జరిగింది. ఇది కూడా మరో విశేషం. ఇందులో కార్తికి హీరోయిన్ ఉండదు.. సినిమాలో పాటలుండవు.

More Related Stories