నేటి నుండి ప్రైమ్ లో సందడి చేయనున్న సాహో Saaho
2019-10-19 11:42:51

ఈ మధ్యకాలంలో సినీ నిర్మాతలకి థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పుడు రిలీజవుతాయా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందే అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనుంది. ‘సాహో’ మూవీకి సంబంధించి నాలుగు భాషల్లో ఈ సినిమా అమెజాన్‌లో ప్రదర్శితం కానుంది. నాలుగు భాషల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ రూ.42 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ అని చెప్పచ్చు. హిందీ వర్షన్ మాత్రం ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే సినిమా బాలేదని తీసిపారేశారు. అయినప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.424 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ‘సాహో’ నష్టాలే మిగిల్చి, బాలీవుడ్‌లో మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది.

More Related Stories