అలీ తీరుపై మండిపడుతున్న రివ్యూ రైటర్స్..  Comedian Ali
2019-10-23 19:17:53

కమెడియన్ అలీ నోటికి అడ్డూ అదుపు ఉండదు. ఏది పడితే అది మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు అలీ. ఇప్పటికే చాలాసార్లు ఇలా నోరు జారాడు. ఇప్పుడు మరోసారి రివ్యూ రైటర్లపై నోరు జారి అడ్డంగా బుక్ అయిపోయాడు కమెడియన్. రాజుగారిగది 3 సినిమాకు నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు కమెడియన్ అలీ. సీనియర్ నటుడు అనే కనీస మర్యాదను కూడా పోగొట్టుకున్నాడు ఈయన. సినిమా ఎలా ఉందో చెప్పడానికి ప్రేక్షకులు ఉన్నారు మధ్యలో మీరెవర్రా కోన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ పరుష పదజాలాన్ని వాడాడు. దాంతో రివ్యూ రైటర్స్ ఇప్పుడు అలీపై రివర్స్ కౌంటర్లు మొదలుపెట్టారు. 

మేము నీ గురించి ఏం చెప్పకుండానే.. ఏం రాయకుండానే ఇంత పైకి వచ్చావా అంటూ ఆయనపై సిరియస్ అవుతున్నారు ఇండస్ట్రీలో సీనియర్ జర్నలిస్టులు. రివ్యూవర్లకు కనీస గౌరవం ఇవ్వాలని కూడా తెలియని అలీని ఏమనాలో కూడా అర్థం కావడం లేదంటున్నారు వాళ్లు. ఓ సినిమా బాగున్నపుడు కచ్చితంగా బాగుందనే ఇస్తారు.. దాన్ని నాశనం చేసేంత సీన్ ఎవరికి ఉండదు. నిజంగా రివ్యూలే కొంప ముంచేస్తే నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమాలు కూడా ఆడుతున్నాయి కదా అంటున్నారు. అలా కాదంటే అద్భుతమైన రేటింగ్ ఇచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతున్నాయి మరి దానికేమంటారు అంటూ అలీపై సీరియస్ అవుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది అంటూ ఆయనపై సీనియర్ జర్నలిస్టులు కౌంటర్ వేస్తున్నారు. మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా.. ఎలాగూ ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వవు.. ఇంకా నువ్వు మారవా అంటూ అలీపై సోషల్ మీడియాలో కూడా కౌంటర్స్ మొదలయ్యాయి. మరి దీనిపై ఈయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిక. 
 

More Related Stories