సంచలన గాయకుడి స్వరం అల్లు అరవింద్ కు అస్సలు నచ్చదట..  allu aravind
2019-10-24 12:35:37

తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ సింగర్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా సిద్ శ్రీరామ్ అని చెప్పొచ్చు. తెలుగు ఒక్కముక్క కూడా రాని ఈ గాయకుడు ఇప్పుడు మన ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఈయన పాట పాడితే చాలు ఇప్పుడు యూట్యూబ్ షేక్ అయిపోతుంది. తాజాగా ఈయన స్వరం నుంచి వచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని 'సామజవరగమన' కు ఏకంగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే సిద్ శ్రీరామ్ గొంతు అంటే అల్లు అరవింద్ కు మాత్రం అస్సలు నచ్చదని తెలుస్తుంది. ఇప్పుడు కాదు నిజానికి విజయ్ దేవరకొండతో 'గీతగోవిందం' సినిమాను తీస్తున్నప్పుడే ఈయనతో పాట పాడించడం మనోడికి అస్సలు ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఈయన పాడిన 'ఇంకేం ఇంకేం కావాలి' పాట సంచలనాలు సృష్టించింది. కానీ ఈ గొంతు విని తెలుగు కూడా సరిగ్గా రాదు.. మరో గాయకుడితో పాడించండని అరవింద్ దర్శకుడు పరుశురామ్ కు చెప్పాడని.. కానీ హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగి అల్లు అరవింద్ ను కూల్ చేసాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ పాట ఎంతలా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మళ్లీ 'అల వైకుంఠపురంలో' విషయంలో కూడా శ్రీరామ్ వద్దని అరవింద్ చెప్తే త్రివిక్రమ్, బన్నీ మాత్రం పట్టుబట్టి మరీ ఆయనతోనే పాడించారు. ఈ పాట ఇన్ స్టంట్ హిట్ కావడంతో సినిమా బిజినెస్ కూడా మారిపోయింది. ఏదేమైనా ప్రపంచమంతా మెచ్చిన వాయిస్ అల్లు అరవింద్ కు నచ్చకపోవడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. 
 

More Related Stories