రూలింగ్ మొద‌లు పెట్ట‌నున్న నందమూరి బాలకృష్ణ..Balakrishna
2019-10-26 15:22:51

అదేంటి ఇప్పుడు బాల‌య్య ఉన్న‌ది రూలింగ్ పార్టీలో కాదు క‌దా అనుకుంటున్నారా..? అవి రాజ‌కీయాలు.. ఇవి సినిమాలు. ఈయ‌న రెండింట్లో ర‌చ్చ చేస్తున్నాడు క‌దా..! ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈయన ఇప్పుడు వరస సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఈయన కేఎస్ ర‌వికుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రస్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జరుగుతుంది. అదేం విచిత్రమో గానీ ఇండ‌స్ట్రీలో ఉన్న మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ అన్నీ వెతుక్కుంటూ మ‌రీ బాల‌య్య ద‌గ్గ‌రికే వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో స‌మ‌ర‌సింహా అన్నా.. ఆ త‌ర్వాత న‌రసింహా అన్నా.. సింహా అన్నా.. లెజెండ్ అన్నా.. ల‌య‌న్ అన్నా.. డిక్టేట‌ర్ అన్నా.. జై సింహా అన్నా ఇవ‌న్నీ బాల‌య్యకే బాగా సెట్ట‌య్యాయి. ఇక ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో రానున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. కేఎస్ ర‌వికుమార్ తో ఈయ‌న చేయ‌బోయే సినిమాకు రూల‌ర్ అని టైటిల్ కన్ఫర్మ్ చేసారు. చాలా రోజుల నుంచి ఇదే ప్ర‌చారంలో ఉంది. ఇప్పుడు ఇదే కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు. ఇప్ప‌టికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పోస్టర్ కూడా బాగానే అనిపిస్తుంది. ఈ టైటిల్ ను ఇదివరకే ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిష్ట‌ర్ చేయించాడు నిర్మాత సి క‌ళ్యాణ్. ఇప్పుడు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాలో ముందు పోలీస్ ఆఫీసర్ గా ఆ తర్వాత డాన్ గా మారతాడు. అదేంటి అనేది అసలు కథ..

More Related Stories